XChat Launch : వాట్సాప్ ఇక కాస్కో.. మస్క్ ‘XChat’ వస్తోందోచ్.. ఈవారంలోనే లాంచ్.. ఫుల్ ప్రైవసీ ఫీచర్లతో..!
XChat Launch : ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, కాలింగ్ ఫీచర్ XChat ను ఎలన్ మస్క్ ఆవిష్కరించారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, ఫైల్ షేరింగ్, వానిషింగ్ మెసేజ్‌లతో వాట్సాప్‌కు పోటీగా రానుంది.

XChat Launch
XChat Launch : వాట్సాప్‌కు పోటీగా కొత్త XChat మెసేజింగ్ యాప్ వచ్చేస్తోంది. ఈ వారంలో యూజర్లకు కొత్త ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, కాలింగ్ సర్వీస్ (XChat Launch) అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని బిలియనీర్, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన ప్లాట్‌ఫామ్ (X)ను డిజిటల్ ఎకోసిస్టమ్‌గా మార్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా XChat అప్లికేషన్ రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి ఈ మెసేజింగ్ యాప్ కొత్త ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, కాలింగ్ ఫీచర్ కలిగి ఉంది. ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ఏయే ఫీచర్లు ఉంటాయి? నిజంగా వాట్సాప్‌ను అధిగమించగలదా? అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్ ఫీచర్ :
XChat అనేది కొత్త ఫీచర్.. ఎక్స్ యూజర్ల కోసం డెవలప్ అయింది. డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్‌పై రెడీ అవుతోంది. ఈ యాప్ వాట్సాప్ మాదిరిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కలిగి ఉంటుంది. మెసేజ్ పంపిన కాసేపటికే ఆటోమాటిక్‌గా అదృశ్యమైపోతాయి. అలాగే, మీరు ఎలాంటి ఫైల్స్ అయినా సరే ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వాట్సా్ప్‌లాగా ఫోన్ నంబర్ అవసరం లేకుండానే యాక్సస్ చేయొచ్చు. అలాగే, ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడవచ్చు.
అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ XChat ఫీచర్ వాట్సాప్‌కు గట్టి పోటీనివ్వనుంది. ఏవైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే తప్ప.. ఈ వారమే XChat యాప్ లాంచ్ అవుతుందని మస్క్ పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమంది X ప్రీమియం సబ్‌స్క్రైబర్లు XChat సర్వీసును ఎర్లీ వెర్షన్ యాక్సెస్ ద్వారా టెస్టింగ్ చేస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
సిగ్నల్ ప్రైవసీ, బిట్‌కాయిన్ స్టయిల్ సెక్యూరిటీ? :
ప్రైవసీ, ఎన్‌క్రిప్షన్ పరంగా యూజర్లకు ఫుల్ ప్రైవసీ ఉంటుందని అంటున్నారు. వాట్సాప్ కన్నా XChatలో ప్రైవసీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రైవసీ పరంగా ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్ సిగ్నల్ యాప్‌తో పోటీపడేలా Xలో డైరెక్ట్ మెసేజింగ్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని మస్క్ గతంలోనే ప్రస్తావించారు. XChat “బిట్‌కాయిన్-స్టయిల్ ఎన్‌క్రిప్షన్” కూడా కలిగి ఉంటుందని మస్క్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అయితే, బిట్‌కాయిన్ మాదిరిగా ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించదు. బదులుగా బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను సేఫ్‌గా ఉంచేలా క్రిప్టోగ్రఫీ, డిజిటల్ సైనింగ్‌పై ఆధారపడుతుంది. ఇతర మెసేజింగ్ యాప్‌ల కన్నా ఎక్కువ ప్రైవసీ అందించడమే లక్షమని అంటున్నారు. ప్రైవసీ విషయంలో వాట్సాప్‌ను కూడా గతంలో మస్క్ విమర్శించార. దీనికి తగినంత యూజర్ సేఫ్టీ లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే.