Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సందర్భంగా శాంసంగ్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర రూ. 41వేల తగ్గింపుతో లభ్యమవుతుంది. మంచి కెమెరా, యూజర్ ఎక్స్‌పీరియన్స్, డిజైన్, పర్ఫార్మెన్స్, ఏఐ ఫీచర్‌లతో ఆల్ రౌండర్ ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్..
2/7
ఫ్లిప్‌కార్ట్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ శాంసంగ్ 5G ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్, అమోల్డ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ సరసమైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/7
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ 5G ఫోన్ ధర ఎంతంటే? : ప్రస్తుతం, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర రూ.78,998కి అమ్ముడవుతోంది. రూ.1,19,999 ధర నుంచి భారీగా తగ్గింది. ఇంకా, ఆసక్తిగల కొనుగోలుదారులు ఎస్బీఐ లేదా యాక్సస్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ధర రూ.75వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
4/7
కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.55,800 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ తగ్గింపు అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ నెలకు రూ.2,777 నుంచి నో-కాస్ట్ ఈఎంఐతో సహా ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తుంది. ఆసక్తగల కొనుగోలుదారులు ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా ఇతర యాడ్-ఆన్ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
5/7
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు : 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.8-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. బటర్-స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అద్భుతమైన కలర్ ఆప్షన్లతో వస్తుంది.
6/7
హుడ్ కింద అడ్రినో 750 జీపీయూతో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3ని కలిగి ఉంది. లాంగ్ గేమింగ్ సెషన్‌లకు ఎలాంటి లాగ్ ఉండదు. 45W ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కూడా అందిస్తుంది.
7/7
200MP మెయిన్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఆకర్షణీయమైన ఫొటోలు, వీడియోలను కూడా తీసుకోవచ్చు. సెల్ఫీల విషయానికి వస్తే.. 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.