Samsung Galaxy S25 Ultra : అమెజాన్ ఆఫర్ అదుర్స్.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ అతి చౌకైన ధరకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 Ultra భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S25 Ultra

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ సిరీస్‌లో మొత్తం 4 స్మార్ట్‌ఫోన్లలో (Samsung Galaxy S25 Ultra) గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 ఎడ్జ్, గెలాక్సీ S25 అల్ట్రా ఉన్నాయి. ఇందులో ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఇదొకటి.  ఈ శాంసంగ్ ఫోన్ అమెజాన్ ఇండియాలో భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది.

అమెజాన్‌లో గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గింపు : 

ఈ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 12GB ర్యామ్ వేరియంట్ కలిగి ఉంది. అమెజాన్ ఇండియాలో అసలు ధర రూ. 1,29,999 నుంచి రూ. 1,07,230కు తగ్గింపు పొందింది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 3వేల వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అంతేకాదు.. ఈ శాంసంగ్ ఫోన్ టైటానియం గ్రే, టైటానియం సిల్వర్‌బ్లూ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

Read Also : Waterproof Phones : ఈ వర్షాకాలంలో రూ. 20వేల లోపు 5 బడ్జెట్ ఫ్రెండ్లీ 5G వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు.. నీళ్లలో తడిసినా చెక్కుచెదరవు..!

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల (Samsung Galaxy S25 Ultra) డైనమిక్ LTPO అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. DX యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌ కలిగి ఉంది.

అంతేకాదు.. 7 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ కలిగి ఉంది.

గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డ్యూయల్ పిక్సెల్ PDAFతో డివైజ్ 12MP ఫ్రంట్ స్నాపర్‌ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.