Samsung Galaxy S25 Ultra : భలే డిస్కౌంట్ భయ్యా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇంకా తక్కువ ధరకే కావాలంటే?
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ పై ఏకంగా రూ. 12వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Samsung Galaxy S25 Ultra Price
Samsung Galaxy S25 Ultra Price : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గతంలో కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ ద్వారా రూ. 12వేల వరకు ఆదా చేయొచ్చు. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా శాంసంగ్ టాప్-ఎండ్ మోడల్ కొనుగోలు చేయాలన్నా ఈ డీల్ మీకోసమే. ఇలాంటి డీల్స్ ఎక్కువ కాలం ఉండవు. ఎంత త్వరగా కొనేసుకుంటే అంత బెటర్ అనమాట. అమెజాన్‌లో మీరు ఈ డీల్‌ను ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రూ.1,29,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.1,23,999కి లిస్టు అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా నేరుగా రూ.6వేలు ధర తగ్గింపును అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లాట్‌ఫామ్ రూ.6వేల విలువైన కూపన్‌ను అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడ్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అమర్చి ఉంది. 12GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 10MP 3x టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ శాంసంగ్ ఫోన్‌లో 12MP సెల్ఫీ షూటర్ ఉంది. ఇంకా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.