Summer AC Problems : వేసవిలో ఏసీలు పేలుతాయి జాగ్రత్త.. ఈ 3 AC ఇష్యూలను అసలు నిర్లక్ష్యం చేయొద్దు.. ఈ స్మార్ట్ టిప్స్ తప్పక పాటించండి!
Summer AC Problems : వేసవిలో ఏసీలు తెగ వాడేస్తున్నారా? అదే పనిగా ఏసీలు వాడితే తొందరగా పాడైపోవడమే కాదు.. అధిక ఒత్తిడి కారణంగా ఏసీలు పేలిపోయే ప్రమాదం చాలా ఎక్కువ..

Summer AC Problems
Summer AC Problems : అసలే ఎండాకాలం.. వేసవిలో వేడి పెరుగుతున్న కొద్దీ ఏసీల వినియోగం భారీగా ఉంటుంది. చాలామంది కూలింగ్ కోసం పగలు, రాత్రంతా ఎయిర్ కండిషనర్లను ఆన్‌లో ఉంచుతారు. 24 గంటలూ ఏసీ రన్ కావడంతో అనేక సమస్యలకు దారితీస్తుంది. కొంచెం కూడా రెస్ట్ లేకుండా అదేపనిగా ఏసీలు ఆన్ చేసి ఉంటే తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
అంతేకాదు.. కొన్నిసార్లు అధిక ఒత్తిడి కారణంగా ఏసీలు పేలిపోయే ప్రమాదం లేకపోలేదు. రోజులో ఒక గంట అయినా ఏసీ ఆఫ్ చేయాలి. ఎక్కువ గంటలు ఆన్ చేయడం చాలా ప్రమాదకరం. మీకు కరెంట్ బిల్లులతో పాటు ఏసీ మన్నిక కూడా తగ్గిపోతుంది. ఏసీ సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే రిపేర్ చేస్తే ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు.
ఏసీ ఓవర్‌లోడ్ ప్రమాదానికి సంకేతం :
మీ ఏసీ 24/7 పనిచేయడం ప్రమాదకరం కాదని అనుకోవచ్చు. కానీ ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బతీస్తుందని గమనించాలి. వేడి కారణంగా పార్ట్స్ దెబ్బతినడం, దెబ్బతిన్న వైర్లు లేదా కంప్రెసర్‌లు ఉన్న పార్ట్స్ ఫెయిల్ అవుతాయి. అదే ఒత్తిడి కొనసాగితే చివరికి పేలుడు కూడా దారితీయవచ్చు. ఏసీ భద్రత విషయంలో వినియోగదారులు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.
ఏసీలు పేలడానికి ప్రధాన కారణాలివే :
ఎయిర్ కండిషనర్ పేలిపోవడానికి ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి..
షార్ట్ సర్క్యూట్లు : వైరింగ్ తెగిపోవడం లేదా షార్ట్ సర్క్యూట్లు లోపల మంటలు చెలరేగుతాయి.
కంప్రెసర్ వేడెక్కడం : ఎయిర్ ఫ్లో పనిచేయకపోవడం లేదా దుమ్ము అడ్డుపడటం వల్ల కంప్రెసర్ బాగా వేడెక్కుతుంది. తీవ్ర ఒత్తిడితో పేలుడు సంభవిస్తుంది.
మెయింట్‌నెన్స్ నిర్లక్ష్యం చేయడం : కాయిల్స్, ఫిల్టర్లను క్లీన్ చేసే యాక్టివిటీని నిర్లక్ష్యం చేయడం వల్ల సిస్టమ్ అదనపు గంటలు పనిచేయవలసి వస్తుంది.
ఫాల్టీ పార్ట్స్ : కెపాసిటర్లు, మోటార్లు లేదా ఫ్యాన్లు పనిచేయకపోవడం వల్ల ఏ క్షణంలోనైనా ఫెయిల్ కావచ్చు. ఇంటర్నల్ స్పార్క్‌లు లేదా పాడైపోవచ్చు.
పూర్ ఇన్‌స్టాలేషన్ : అధిక వినియోగంతో లూజ్ వైర్ లేదా సేఫ్ పార్టులను తప్పుగా ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చు.
ఏసీలో సమస్య ఉంటే కనిపించే సంకేతాలివే :
సాధారణంగా మీ ఏసీలో ఏదైనా సమస్య వచ్చే ముందు మీకు వార్నింగ్ ఇండికేషన్లను ఇస్తుంది. మీరు హిస్సింగ్, బజ్జింగ్ లేదా పాపింగ్ వంటి వింత శబ్దాలను గమనించవచ్చు. ఇలాంటి వాటిని ఎప్పుడూ కూడా విస్మరించవద్దు. పొగ, వాసన లేదా కాలిన వాసన అనేది వార్నింగ్ సైన్.
ఏసీ పైభాగం అదరగడం లేదా ఫ్యాన్ సాధారణం కన్నా ఎక్కువగా తిరగడం అనేది మరో వార్నింగ్ సైన్ అని గమనించాలి. ఇంటర్నల్ గా ఏసీలో ఏదైనా పార్ట్ పాడైపోతుందని సంకేతంగా సూచిస్తుంది. వెంటనే ఆ సమస్యను గుర్తించి పరిష్కరించుకోవడం ఎంతైనా మంచిది.
ఏసీ మెయింట్‌నెన్స్ ఎంతో ముఖ్యం :
ఏసీ మెయింట్‌నెన్స్ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఫిల్టర్ రీప్లేస్‌మెంట్‌లు, గ్యాస్ చెక్‌లు, వైరింగ్ చెకింగ్ వంటివి తరుచుగా చేయాల్సి ఉంటుంది. తద్వారా సర్వీస్డ్ యూనిట్ కూలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దాంతో ఏసీ బ్లాస్ట్ వంటి ప్రమాదాలను నివారించవచ్చు.
Read Also : Honor X70i Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ కెమెరాతో హానర్ X70i ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
ఈ వేసవిలో ఏసీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కూలింగ్ సిస్టమ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఏసీలో సమస్య ఏంటో గమనించంండి. ఏసీలో ఏదైనా చెడిపోతే ముందుగానే రిపేర్ చేయించండి. సురక్షితమైన పద్ధతులతో పాటు సరైన మెయింట్‌నెస్స్ ద్వారా రిపేరింగ్ లేదా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.