Honor X70i Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ కెమెరాతో హానర్ X70i ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
Honor X70i Launch : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. హానర్ నుంచి సరికొత్త X70i ఫోన్ వచ్చేసింది. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?

Honor X70i Launch
Honor X70i Launch : హానర్ ఫ్యాన్స్ కోసం సరికొత్త హానర్ ఫోన్ వచ్చేసింది. చైనాలో హానర్ X70i ఫోన్ లాంచ్ అయింది. ఇటీవలే ప్రపంచ మార్కెట్లలో రిలీజ్ అయిన హానర్ 400 లైట్ ఇప్పుడు కొద్ది మార్పులతో సరికొత్త వెర్షన్‌గా రిలీజ్ అయింది. హానర్ X70i ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC ద్వారా పవర్ పొందుతుంది.
ఐఎంజీ BXM-8-256 జీపీయూ ద్వారా ఇంటిగ్రేట్ అయింది. అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. సింగిల్ 108MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 35W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. హానర్ పవర్, హానర్ X60 GT, హానర్ GT ప్రో ఆధారంగా ఏప్రిల్‌లో నాల్గో మోడల్ హానర్ X70i స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది.
హానర్ X70i ధర, కలర్ ఆప్షన్లు :
హానర్ X70i ఫోన్ 8GB + 256GB బేస్ కాన్ఫిగరేషన్ ధర CNY 1,399 (సుమారు రూ. 16వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 256GB, 12GB + 512GB కాన్ఫిగరేషన్లలో కూడా అందుబాటులో ఉంది. వరుసగా ధర CNY 1,699 (సుమారు రూ. 20వేలు) CNY 1,899 (సుమారు రూ. 22వేలు) ఉంటుంది. ఈ ఫోన్ మాగ్నోలియా పర్పుల్, మూన్ షాడో వైట్, వెల్వెట్ బ్లాక్ స్కై బ్లూ అనే 4 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.
హానర్ X70i స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ (నానో + నానో) హానర్ X70i ఆండ్రాయిడ్ 15 ఆధారంగా మ్యాజిక్ OS9.0పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080 × 2,412 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. హానర్ X70i ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది.
ఈ చిప్‌లో 2.5GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో 2 కార్టెక్స్-A78 కోర్లు, 2.0GHz వద్ద 6 కార్టెక్స్-A55 కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్‌ను ఇమాజినేషన్ టెక్నాలజీస్ IMG BXM-8-256 GPU కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో af/1.75 అపెర్చర్‌తో కూడిన సింగిల్ 108MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. గరిష్టంగా 1080p వీడియో రికార్డింగ్ రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపెర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, బ్లూటూత్ లో-ఎనర్జీ (BLE), USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ బీడౌ, GPS, గ్లోనాస్, గెలీలియో, A-GNSS సపోర్టు ఇస్తుంది. 35W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సైజు 161 x 74.55 x 7.29mm, బరువు 178.5 గ్రాములు ఉంటుంది.