OnePlus 13T Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 13T ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
OnePlus 13T Launch : వన్‌ప్లస్ 13T ఫోన్ వచ్చేసింది. 6260mAh బ్యాటరీతో పాటు 6.32 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉంది. ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 13T Launch
OnePlus 13T Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? చైనాలో వన్‌ప్లస్ 13T ఫోన్ లాంచ్ అయింది. వన్‌ప్లస్ 13 సిరీస్‌లో ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పాటు 16GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. వన్‌ప్లస్ 13T కాంపాక్ట్ 6.32-అంగుళాల డిస్‌ప్లేతో అమర్చబడి ఉంది.
ఈ రెండు 50MP సెన్సార్‌లను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,260mAh బ్యాటరీని అందిస్తుంది. వన్‌ప్లస్ 13T అలర్ట్ స్లైడర్‌కు బదులుగా కొత్త ‘షార్ట్‌కట్ కీ’ని కూడా కలిగి ఉంది.
Read Also : Smiley Face Sky : ఆకాశంలో అద్భుతం.. ‘స్మైలీ ఫేస్’ను చూస్తారా? ఈ అరుదైన దృశ్యం ఎప్పుడు, ఎలా కనిపిస్తుందంటే?
వన్‌ప్లస్ 13T ధర, లభ్యత :
12GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ మోడల్ వన్‌ప్లస్ 13T ధర CNY 3,399 (సుమారు రూ. 39వేలు)గా నిర్ణయించింది. 16GB+256GB, 12GB+512GB, 16GB+512GB మోడళ్ల ధర వరుసగా CNY 3,599 (సుమారు రూ. 41వేలు), CNY 3,799 (సుమారు రూ. 43,000), CNY 3,999 (సుమారు రూ. 46వేలు)గా ఉంది. వినియోగదారులు CNY 4,499 (సుమారు రూ. 52,000) టాప్-ఆఫ్-ది-లైన్ 16GB+1TB వేరియంట్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈ కొత్త వన్‌ప్లస్ 13T మోడల్ క్లౌడ్ ఇంక్ బ్లాక్, మార్నింగ్ మిస్ట్ గ్రే, పౌడర్ (పింక్) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం చైనాలో ముందస్తు ఆర్డర్ కోసం రెడీగా ఉంది. ఈ ఫోన్ డెలివరీలు ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయి.
వన్‌ప్లస్ 13T స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ వన్‌ప్లస్ 13T ఆండ్రాయిడ్ 15పై కలర్ఓఎస్ 15.0తో రన్ అవుతుంది. 6.32-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,264×2,640 పిక్సెల్స్) డిస్‌ప్లేను 94.1 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటు, 460ppi పిక్సెల్ డెన్సిటీ, 1,600 నిట్స్ వరకు గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన కొత్త కాంపాక్ట్ హ్యాండ్‌సెట్ మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ 13T అడ్రినో 830 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoCపై రన్ అవుతుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ ఫోన్ 4,400mm చదరపు గ్లేసియర్ వేపర్ చాంబర్ (VC) కూలింగ్ ఏరియా, థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 37,335 చదరపు మిల్లీమీటర్లు మొత్తం హీట్ డిస్సిపేషన్ ఏరియాను కలిగి ఉంది.
ఫోటోలు, వీడియోల కోసం వన్‌ప్లస్ 13Tలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ వైడ్-యాంగిల్ సెన్సార్, f/1.8 ఎపర్చరు, f/2.0 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో 50MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
టెలిఫోటో సెన్సార్ 2x ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్ వరకు అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాను కలిగి ఉంది. వన్‌ప్లస్ 13T ఫోన్ Wi-Fi 7, బ్లూటూత్ 5.4, Beidou, GLONASS, Galileo, GPS, QZSS, NFC లలో కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
బోర్డులోని సెన్సార్లలో యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, ఐఆర్ కంట్రోల్, లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP65 రేటింగ్ ఉంది.
సౌండ్ ప్రొఫైల్స్ కోసం డూ నాట్ డిస్టర్బ్ (DND) మోడ్‌ను యాక్టివేట్ చేయొచ్చు. కెమెరాను యాక్సెస్ చేసేందుకు కస్టమైజడ్ కొత్త షార్ట్‌కట్ కీని కలిగి ఉంది. ఈ కొత్త బటన్ అలర్ట్ స్లైడర్‌ను రిప్లేస్ చేస్తుంది. వన్‌ప్లస్ ఈ హ్యాండ్‌సెట్‌లో 6,260mAh బ్యాటరీని 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 150.81×71.70×8.15mm, బరువు 185 గ్రాములు ఉంటుంది.