Smiley Face Sky : ఆకాశంలో అద్భుతం.. ‘స్మైలీ ఫేస్’ను చూస్తారా? ఈ అరుదైన దృశ్యం ఎప్పుడు, ఎలా కనిపిస్తుందంటే?
Smiley Face Sky : ఏప్రిల్ 25న ఉదయం, శుక్రుడు, శని, చంద్రుడు కలిసి ఆకాశంలో స్మైలీ ఫేస్‌తో కనిపిస్తారు. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన ఎలా వీక్షించాలి? ఎప్పుడు కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Smiley Face Sky
Smiley Face Sky : ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. ఏప్రిల్ 25న ఆ అద్భుతాన్ని నేరుగా చూడొచ్చు. ఏప్రిల్ 25న ఉదయం ఆకాశంలో ఈ ఖగోళ సంఘటన కనువిందు చేయనుంది. సూర్యోదయానికి ముందు ఆకాశంలో ట్రిపుల్ కంజుక్షన్ కనిపిస్తుంది.
సాధారణంగా ఇలాంటి ఖగోళ దృశ్యం కనిపించదు. శుక్రుడు, శని, సన్నని చంద్రవంకతో కలిసి ఆకాశంలో సూర్యోదయానికి ముందు ‘స్మైలీ ఫేస్’గా కనిపించనున్నాయి. దీన్నే ట్రిపుల్ కంజుక్షన్ అని పిలుస్తారు. ఈ ప్రత్యేక ఖగోళ దృశ్యం కనిపించే సమయం ఏంటి? ఎలా చూడాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ట్రిపుల్ కంజుక్షన్ అనే ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన.. స్థానిక సమయం ప్రకారం.. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై దాదాపు గంటసేపు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు నక్షత్ర వీక్షకులకు ప్రత్యేకంగా కనువిందు చేయనుంది. చంద్రుడు, ఆకాశం, సూర్యుడు ఒకేచోట కలిసి నవ్వుతూ కనిపిస్తారు. ఆకాశంలో ఒకదానికొకటి దగ్గరగా త్రిభుజాకారంలో కనిపించనున్నారు.
ట్రిపుల్ కంజక్షన్ ఏంటి? :
ఆకాశంలో 3 ఖగోళ వస్తువులు ఒకదానికొకటి చాలా దగ్గరగా కనిపించినప్పుడు ట్రిపుల్ కంజుక్షన్ ఏర్పడుతుంది. ఏప్రిల్ 25 ఉదయం సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఇలాంటి దృశ్యమే కనిపించనుంది. వాస్తవానికి, ఆ రోజున 3 ఖగోళ వస్తువులు.. శుక్రుడు, శని, చంద్రవంక ఆకాశంలో ఒకటిగా కనిపిస్తాయి.
సాధారణంగా ఖగోళ వస్తువులు అంతరిక్షంలో అంత దగ్గరగా ఉండవు. కానీ, భూమి నుంచి చూసినప్పుడు ఆ మూడూ త్రిభుజాకార రూపంలో దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. చూసేందుకు అచ్చం స్మైలీ ఫేస్ మాదిరిగా ఉంటాయి.
ఏప్రిల్ 25వ తేదీ ప్రత్యేకత ఇదే :
ఏప్రిల్ 25, 2025 ఉదయం సూర్యోదయానికి ముందు శుక్రుడు, శని, ఒక సన్నని చంద్రుడు ఆకాశంలో ముగ్గురు కలిసి “స్మైలీ ఫేస్” ఆకారంలో కనిపిస్తాయి. ఈ దృశ్యం చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది. ఉదయం 5:30 గంటలకు సూర్యుడు ఉదయించిన తర్వాత అదృశ్యమవుతుంది.
ఈ ఖగోళ దృశ్యాన్ని ఎలా చూడాలి? :
సమయం : ఉదయం 5:30 గంటలకు (స్థానిక సమయం).
డైరెక్షన్ : తూర్పు వైపు చూడండి.
లొకేషన్ : తూర్పు దిశలో ఎత్తైన భవనాలు లేదా చెట్లు లేని ప్రదేశాన్ని ఎంచుకోండి.
ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని చూడవచ్చు. కానీ, బైనాక్యులర్లతో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
Read Also : Pakistan Stock Market : పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్..!
శుక్రుడు, శని, చంద్రుడు ఎలా ఉంటారు? :
- శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా పైకి ఉంటాడు. “సన్ రైజ్ స్టార్” అని పిలుస్తారు.
- శని శుక్రుడి కన్నా కొంచెం ప్రకాశవంతంగా దిగువ-ఎడమ వైపు కనిపిస్తుంది.
- చంద్రుడు సన్నగా దిగువన ఉండి చిరునవ్వు లాంటి ఆకారంలో కనిపిస్తాడు.
- ఈ మూడింటితో పాటు, బుధుడిని కూడా చూడవచ్చు.
- కానీ, హోరిజోన్ దగ్గర చాలా తక్కువగా మసకగా కనిపిస్తుంది.