Google Pixel 9 : ఆఫర్ అదిరింది అబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. తక్కువ ధరలో ఈ డీల్ మళ్లీ రాదు!

Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ 9 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఈ పిక్సెల్ ఫోన్‌పై రూ. 12వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోండి.

Google Pixel 9 : ఆఫర్ అదిరింది అబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. తక్కువ ధరలో ఈ డీల్ మళ్లీ రాదు!

Google Pixel 9 Price

Updated On : April 23, 2025 / 5:23 PM IST

Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కొత్త ఫోన్ కోసం చూస్తుంటే మీకు ఇదే సరైన అవకాశం. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 12వేలు భారీ తగ్గింపును అందిస్తోంది.

Read Also : CMF Phone 2 Pro : నథింగ్ లవర్స్ కోసం కొత్త CMF ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఈ ఆకర్షణీయమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మీరు పాత ఫోన్ వదిలేసి పిక్సెల్ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్. ఇలాంటి అద్భుతమైన డీల్స్ ఎక్కువ రోజులు ఉండవని గమనించాలి. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలి? అనేది వివరంగా తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 9 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.74,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పై రూ.5వేల ధర తగ్గింపును అందిస్తోంది. అలాగే, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో అదనంగా రూ.7వేలు తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవ్ చేయాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కూడా ట్రేడ్ చేయవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 1080 x 2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా, ఈ డిస్‌ప్లే 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. HDRకి సపోర్టు ఇస్తుంది.

గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Ultra 5G : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ.31,533 వరకు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేయొద్దు..!

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 10.5MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది.