CMF Phone 2 Pro : నథింగ్ లవర్స్ కోసం కొత్త CMF ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

CMF Phone 2 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఈ నెల 28న సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర వివరాలు లీక్ అయ్యాయి.

CMF Phone 2 Pro : నథింగ్ లవర్స్ కోసం కొత్త CMF ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

CMF Phone 2 Pro Launch

Updated On : April 23, 2025 / 3:15 PM IST

CMF Phone 2 Pro Launch : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో నథింగ్ కంపెనీ నుంచి కొత్త ఫోన్ భారతీయ మార్కెట్లోకి రానుంది. కంపెనీ సబ్-బ్రాండ్ CMF నుంచి CMF ఫోన్ 2 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రాకముందే ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి.

Read Also : AI Cure Diseases : వచ్చే 10 ఏళ్లలో AI అన్ని వ్యాధులను అంతం చేయగలదు : గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు..!

ఇప్పటికే కంపెనీ ఫీచర్లను కూడా రివీల్ చేసింది. కానీ, ఇప్పుడు ధర వివరాలు లీక్ అయ్యాయి. వచ్చే వారం ఏప్రిల్ 28న సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో CMF మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మిడ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

CMF ఫోన్ 2 ప్రో భారత్ ధర (అంచనా) :
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మోడల్ 2 మోడల్ (128GB వేరియంట్, 256GB వేరియంట్) స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. ఈ రెండూ ఫోన్లలో 8GB ర్యామ్ కలిగి ఉంది. 128GB మోడల్ ధర దాదాపు రూ. 18,999 ఉంటుందని అంచనా. 256GB వేరియంట్ రూ. 20,999కి లాంచ్ కావచ్చు. గతంలో కంపెనీ 8GB, 128GB మోడల్ సీఎంఎఫ్ ఫోన్ 1 ధర రూ. 15,999కు ప్రవేశపెట్టగా, 256GB వేరియంట్ ధర రూ. 17,999గా ఉంది.

CMF ఫోన్ 2 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఫీచర్ల విషయానికొస్తే.. అమోల్డ్ ప్యానెల్‌తో కూడిన 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ఫోన్ 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Samsung Galaxy M56 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ చూశారా? అమెజాన్‌లో ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మోడల్ 5000mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.