Samsung Galaxy M56 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ చూశారా? అమెజాన్‌లో ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Samsung Galaxy M56 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ కావాలా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫస్ట్ సేల్ మొదలైంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ఎలా కొనుగోలు చేయాలంటే?

Samsung Galaxy M56 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ చూశారా? అమెజాన్‌లో ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Samsung Galaxy M56 5G

Updated On : April 23, 2025 / 2:31 PM IST

Samsung Galaxy M56 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఫస్ట్ టైం శాంసంగ్ గెలాక్సీ M56 అమ్మకానికి రానుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫోన్ గత వారమే భారత మార్కెట్లో లాంచ్ అయింది.

ఈ 5G ఫోన్ రూ. 25వేల కన్నా తక్కువ ధరకు వచ్చింది. ఈ గెలాక్సీ M56 ఫోన్ ఎక్సినోస్ చిప్‌సెట్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ సపోర్ట్‌తో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి.

Read Also : Largest Gold Reserves : వామ్మో.. టన్నుల కొద్ది బంగారం.. అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్ 10 దేశాలివే.. భారత్ ర్యాంకు ఎక్కడంటే?

శాంసంగ్ గెలాక్సీ M56 సేల్, ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ M56 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రధాన రిటైల్ ఛానెల్స్ ద్వారా అమ్మకానికి వచ్చింది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M56 బేస్ 8GB/128GB మోడల్ ధర రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది.

మరోవైపు, 8GB/256GB వేరియంట్ ధర రూ.30,999కు పొందవచ్చు. అంతేకాకుండా, HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా గెలాక్సీ M56 5G కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. చివరగా, శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫోన్ లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M56 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M56లో 2.75GHz వరకు ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ అమర్చి ఉంది. ఎంఎండీ ఎక్స్‌క్లిప్స్ 530 GPUతో వస్తుంది. 8GB (LPDDR5X) ర్యామ్‌తో పాటు 128GB లేదా 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్ సిమ్ (నానో + నానో), USB టైప్-C ఆడియో, Wi-Fi (802.11 ac), బ్లూటూత్ వెర్షన్ 5.3, జీపీఎస్ + GLONASS, NFC, 4G నెట్‌వర్క్‌ల కోసం VoLTEతో పాటు 5G కోసం SA/NSA మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందున్న దానికంటే 33శాతం పెద్ద వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత OneUI 7ని బాక్స్ వెలుపల రన్ అవుతుంది. శాంసంగ్ 6 జనరేషన్ల వరకు OS అప్‌గ్రేడ్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది.

ఫ్రంట్, బ్యాక్ కెమెరాలలో 10-బిట్ HDR రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, ఇందులో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5,000mAh, సూపర్-ఫాస్ట్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ ద్వారా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : AI Cure Diseases : వచ్చే 10 ఏళ్లలో AI అన్ని వ్యాధులను అంతం చేయగలదు : గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు..!

అయితే, బాక్స్‌లో ఛార్జర్ లేదు. గెలాక్సీ M56 కేవలం 7.2mm మందం మాత్రమే ఉందని శామ్‌సంగ్ పేర్కొంది. ఈ ఫోన్ రెండు వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మెటల్ కెమెరా డెకోను కూడా కలిగి ఉంది.