Smiley Face Moon : రేపే ఆకాశంలో ‘స్మైలీ ఫేస్ మూన్’.. ప్రత్యేకత ఏంటి? ఈ అద్భుతమైన దృశ్యాన్ని అసలు మిస్ కావొద్దు!
Smiley Face Moon : సూర్యోదయానికి ముందు తూర్పు హోరిజోన్ వైపు యూకే, ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర అర్ధగోళంలో మీరు ఎక్కడ నుంచైనా ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని వీక్షించవచ్చు.

Smiley Face Moon
Smiley Face Moon : ఏప్రిల్ 25న ఆకాశంలో ‘స్మైలీ మూన్’ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. దీనికో ప్రత్యేకత ఉంది.. మూడు గ్రహాల కలయికతో ఈ అద్భుత ఖగోళ దృశ్యం ఏర్పడనుంది. శుక్రుడు, శని, చంద్రులు ఒకేచోట కలిసిన సమయంలో ఈ స్మైలీ ఫేస్‌తో మూన్ కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకాశం నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా తెల్లవారుజాము సమయంలో మాత్రమే కనిపిస్తుంది. సన్నని చంద్రవంక ఆకాశంలో తొంగిచూస్తు నవ్వినట్టుగా కనిపిస్తుంది.
Read Also : Pakistan Stock Market : పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్..!
పైభాగంలో శుక్రుడు, శని ఉంటే.. :
స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జరగబోయే ఈ ఖగోళ సంఘటననే ట్రిపుల్ కంజుక్షన్ అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఉదయించే సమయానికి ఆకాశంలో తూర్పున శుక్రుడు, శని, చంద్రవంక కనిపించనుంది. తూర్పు దిశగా భూమి, సముద్రం ఒకే రేఖ వద్ద కలిసినట్టుగా ఉంటుంది.
అయితే, నవ్వుతూ కనిపించే ఆ స్మైలీ గీతకు పైభాగాన శుక్రుడు, శని ఉంటే.. కొంచెం కిందిభాగంలో నెలవంక ఉండి మూడు ఒకేచోట దగ్గరగా ఉన్నట్టుగా ఆవిష్కృతం కానున్నాయి. శుక్రుడు, శని కళ్ల మాదిరిగా ఉంటే.. చంద్రుడు మాత్రం పెదాల మాదిరిగా నెలవంకలా కనువిందు చేయనున్నాడు.
90° సవ్యదిశలో ఉన్న ఒక స్మైలీ ఫేస్ ఊహించుకోండి. అచ్చం అలాగే రెండు గ్రహాలు, చంద్రునితో కలిసి ఉంటాయి. సన్నని చంద్రవంక చిరునవ్వులా ఉంటే.. శుక్రుడు ముఖానికి కుడి కన్నుగా, శని ముఖం ఎడమ కన్నుగా కనిపిస్తుంది. చంద్రునికి దగ్గరగా రావడం వల్ల ‘స్మైలీ ఫేస్’ మాదిరిగా కనిపిస్తాయి. దీన్నే ఖగోళ శాస్త్రంలో మాసింగ్ అంటారు. చంద్రుడు సన్నని చంద్రవంక ఏప్రిల్ 13న పౌర్ణమి నుంచి మొదలై ఇప్పుడు ఏప్రిల్ 27న అమావాస్య వైపు క్షీణిస్తున్నాడు.
స్మైలీ మూన్ ఇలా చూస్తేనే బెటర్ :
స్మైలీ మూన్ అద్భుత ఆవిష్కరణకు సంబంధించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ప్రకటన చేసింది. శని, శుక్రుడు ప్రకాశవంతంగా కనిపించడంతో ఎలాంటి డివైజ్‌ల అవసరం లేకుండానే నేరుగా వీక్షించవచ్చు.
కానీ, స్మైల్ మూన్ మాత్రం స్టార్ గాజింగ్ బైనోక్యులర్ టెలిస్కోప్ చూడటం ద్వారా అద్భుతంగా దృశ్యం కనిపిస్తుందని చెబుతున్నారు. ఆ ఖగోళ దృశ్యం కనిపించే సమయంలో ఎలాంటి మబ్బులు లేకుంటే స్మైలీ ఫేస్ మూన్ కింద బుధుడిని కూడా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు తూర్పు హోరిజోన్ వైపు యూకే, ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర అర్ధగోళంలో మీరు ఎక్కడ నుంచైనా ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని వీక్షించవచ్చు.
Read Also : Smiley Face Sky : ఆకాశంలో అద్భుతం.. ‘స్మైలీ ఫేస్’ను చూస్తారా? ఈ అరుదైన దృశ్యం ఎప్పుడు, ఎలా కనిపిస్తుందంటే?
ఏప్రిల్ 25, 2025న సూర్యోదయానికి దాదాపు 30 నిమిషాల ముందు అంటే.. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై దాదాపు గంటసేపు కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రకాశవంతమైన చంద్రుడు, శుక్రుడు, మసకగా ఉన్న శనితో త్రిభుజాకారంగా కనిపిస్తారు. బుధుడు హోరిజోన్ దగ్గర ఉంటుంది. అయితే, ఈ గ్రహాన్ని నేరుగా గుర్తించడం కొద్దిగా కష్టంగా ఉండొచ్చు.