SBI Bank Holiday Alert : SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఏ రోజు నుంచి ఎప్పటివరకంటే?

SBI Bank Holiday Alert 2026 : ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం 2 రోజుల సమ్మెను ప్రకటించింది. దీని కారణంగా బ్యాంకులు వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్నాయి. పూర్తి వివరాలివే..

SBI Bank Holiday Alert

  • రెండు రోజుల సమ్మెకు దిగనున్న ఎస్బీఐ ఉద్యోగులు
  • వరుసగా 6 రోజులు మూతపడనున్న ఎస్బీఐ బ్యాంకులు
  • ఏ రోజు నుంచి ఎప్పటివరకూ బ్యాంకులు పనిచేయవంటే?

SBI Bank Holiday Alert 2026: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఎస్బీఐ బ్యాంకులు వరుసగా 6 ఆరోజులు మూతపడనున్నాయి. మే 23 (4వ శనివారం), మే 24 (ఆదివారం) దేశవ్యాప్తంగాబ్యాంకులు పనిచేయవు. ఒకవేళ ఎస్‌బిఐ సమ్మె అమలైతే ఎస్‌బీఐ కస్టమర్లు వరుసగా 6 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలను పొందలేరు. ఆ తర్వాత బక్రీద్ సెలవులు (మే 27, 28) కూడా ఉన్నాయి.

బ్యాంకు శాఖలో క్యాష్ డిపాజిట్ చేయడం, చెక్కులను క్లియర్ చేయడం లేదా ముఖ్యమైన (SBI Bank Holiday Alert) పనులకు ఆటంకం ఏర్పడొచ్చు. అంతేకాదు.. రాష్ట్రాల వారీ సెలవులను కూడా కలిపితే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఎక్కువ రోజులు కొనసాగవచ్చు. బ్యాంకులకు సెలవులు ఎందుకు? ఉద్యోగులు ఎప్పుడు సమ్మె చేస్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మే 25, మే 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో పనిచేస్తున్న ఉద్యోగుల సంస్థ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ మే 25, 26 తేదీలలో రెండు రోజుల సమ్మెను ప్రకటించింది. చాలా కాలంగా తమ డిమాండ్లపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని, అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని యూనియన్ పేర్కొంది. ఈ సమ్మె ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాల్లోని ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయి.

బ్యాంకు బ్రాంచ్‌లు 6 రోజులు బంద్ :
వారాంతం, సమ్మె, రాబోయే పండుగ సెలవులు ఒకేసారి వస్తే.. కొన్ని రాష్ట్రాల్లో వరుసగా 6 రోజుల వరకు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం కలగవచ్చు. ఇందులో మే 23, 24 తేదీలు వారాంతం, మే 25, 26 తేదీల్లో సమ్మె, ఆ తర్వాత వచ్చే బక్రీద్ సెలవులు (మే 27, 28) కూడా ఉండవచ్చు. ఈ సమయంలో, వినియోగదారులు బ్యాంకు బ్రాంచుల సర్వీసులను పొందలేరు. తద్వారా అనేక సాధారణ ఆర్థిక లావాదేవీలకు అంతరాయం ఏర్పడొచ్చు.

Read Also : PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్! ఈ చిన్న మిస్టేక్ చేసినా రూ. 2వేలు పడవు.. అర్జెంట్‌గా ఇలా చేయండి!

యూనియన్ డిమాండ్లు, వివాదాలు :
కొత్త నియామకాలు, పెన్షన్ విషయంలో వెసులుబాటు, పదోన్నతి విధానాలలో అప్ గ్రేడ్, అద్భుతమైన వర్కింగ్ కండిషన్లతో సహా తమకు మొత్తం 16 ప్రధాన డిమాండ్లు ఉన్నాయని ఉద్యోగుల సంఘం పేర్కొంది. అనేక శాఖలలో సిబ్బంది కొరత తీవ్రమైన సమస్యగా మారిందని సంఘం తెలిపింది.

అలాగే, జీతాలలో వ్యత్యాసం, భద్రత లేకపోవడం, శాఖలలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడం వంటి సమస్యలను ప్రధాన ఆందోళనలుగా పేర్కొన్నారు. అనేక చర్చలు జరిగినప్పటికీ, ఈ సమస్యలను పరిష్కరించేందుకు బ్యాంకు యాజమాన్యం ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని సంఘం ఆరోపిస్తోంది.

వినియోగదారులపై ప్రభావం ఉంటుందా? :
ఈ సెలవుల పొడిగింపు సమయంలో క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా (లిమిటెడ్ ఏటీఎంలు మినహా), చెక్ క్లియరెన్స్, లోన్ ప్రాసెసింగ్, కేవైసీ సంబంధిత బ్యాంకు శాఖల కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చు. వ్యక్తిగతంగా అవసరమయ్యే ఏవైనా డాక్యుమెంట్ లజారీలో జాప్యం జరగవచ్చు. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ వంటి డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయి.

ఆర్బీఐ బ్యాంకింగ్ సెలవుల పథకం :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారాలు, ప్రతి నెల రెండో, నాల్గో శనివారాలు, ప్రభుత్వ సెలవు దినాలలో మూతపడతాయి. అలాగే, అదనంగా, రాష్ట్రాలను బట్టి స్థానిక పండుగల రోజున బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సెలవుల క్యాలెండర్లు వేర్వేరుగా ఉంటాయి.

వినియోగదారులకు అలర్ట్ :
బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం బెటర్. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీల పరిమితులు, ఇతర వివరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.