SBI Fixed Deposit : SBIలో 3 ఏళ్ల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? సీనియర్ సిటిజన్లకు నిజంగా జాక్ పాట్..!
SBI Fixed Deposit : ఎస్బీఐ (SBI) కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్.. సీనియర్ సిటిజన్లు అయితే ఇప్పుడే FD ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 3 ఏళ్ల FDలపై భారీ మొత్తంలో వడ్డీ రేట్లను పొందవచ్చు.
- Sreehari A
- Published on- September 12, 2026 / 09:39 PM IST
SBI Fixed Deposit
- ఎస్బీఐలో సీనియర్ సిటిజన్ల కోసం భారీ వడ్డీ రేట్లు
- మూడేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై అద్భుతమైన రాబడి
- సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ అందించే ఆఫర్లు
SBI Fixed Deposit : సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన పథకం.. ఎలాంటి రిస్క్ లేకుండా మీ సేవింగ్స్‌పై గ్యారెంటీతో సురక్షితమైన రాబడిని పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD)తో భారీ మొత్తంలో వడ్డీని సంపాదించుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్ల కోసం అద్భుతమైన FD వడ్డీ రేట్లను అందిస్తోంది.
కస్టమర్ల సంఖ్య, బ్రాంచుల నెట్‌వర్క్, మార్కెట్ క్యాప్ పరంగా ఎస్బీఐలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి ఎఫ్‌డీలపై కస్టమర్లకు 3.05శాతం నుంచి 7.15శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఎస్‌బీఐలో 3 ఏళ్ల కాలానికి ఎఫ్‌డీ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3 ఏళ్ల FDపై వడ్డీ ఎంతంటే? :
ఎస్బీఐలో 3 ఏళ్ల ఎఫ్‌డీ పథకంలో సాధారణ పౌరుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. రూ.3 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై ఈ బ్యాంకు 3 ఏళ్ల కాలానికి 6.30శాతం నుంచి 6.90శాతం వరకు వార్షిక వడ్డీ రేట్లను అందిస్తుంది.
Read Also : BoB FD Interest : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ బ్యాంకులో 400 రోజుల FDపై భారీగా వడ్డీ సంపాదించుకోవచ్చు.. !
59 ఏళ్ల లోపు సాధారణ పౌరులకు 3 ఏళ్ల కాలపరిమితి ఎఫ్ డీలపై 6.30శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడిన వారికి 3 ఏళ్ల కాలపరిమితి FDలపై 6.80శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లు 80 ఏళ్లు లేదా ఆపై ఎక్కువ వయస్సు ఉన్నవారికి 3 ఏళ్ల ఎఫ్‌డీలపై 6.90శాతం బంపర్ వడ్డీని అందిస్తోంది.
సీనియర్ సిటిజన్ల కోసం బెనిఫిట్స్ ఏంటి? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించేందుకు అధిక మొత్తంలో వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే, 60 ఏళ్లు లేదా ఆపై ఎక్కువ వయస్సు ఉన్న వయోవృద్ధులకు అన్ని కాలపరిమితుల FDలపై 0.50శాతం అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది.
అదేవిధంగా, 80 ఏళ్లు లేదా ఆపై ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లు కూడా సాధారణ వయోవృద్ధుల కన్నా 0.10శాతం అధిక వడ్డీ రేట్లను పొందుతారు. ఈ విధంగా మొత్తం మీద 0.60శాతం అధిక వడ్డీ రేట్లు పొందవచ్చు.
