Banks New Rules
Banks New Rules 2026 : బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. బ్యాంకు అకౌంట్ల నుంచి కార్డు సంబంధిత అన్ని నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దేశీయ ప్రధాన బ్యాంకుల్లో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కస్టమర్లపై ఛార్జీల ప్రభావం పడుతుంది.
రోజువారీ లావాదేవీలు, క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేస్తే వాటిపై ఛార్జీలు పడనున్నాయి. అలాగే రివార్డు పాయింట్లను ఇక పొందలేరు. IMPS పేమెంట్లపై కూడా సర్వీసు ఛార్జీలను సవరించింది. అలాగే కేవైసీ రూల్స్ కూడా మారాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ :
ఫిబ్రవరి 1, 2026 నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై (BookMyShow)ద్వారా కాంప్లిమెంటరీ మూవీ బెనిఫిట్స్ నిలిపివేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. అలాగే, ట్రాన్స్ పోర్ట్, ఇన్సూరెన్స్ ఖర్చులపై రివార్డ్ పాయింట్లను కొనసాగించనుంది.
ఎస్బీఐ IMPS లావాదేవీ ఛార్జీలు
ఎస్బీఐ కొన్ని ఐఎంపీఎస్ లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలను సవరించింది. ఫిబ్రవరి 15, 2026 నుంచి రూ. 25వేల కన్నా ఎక్కువ, రూ. 1 లక్ష వరకు ఆన్‌లైన్ ఎస్బీఐ ఐఎంపీఎస్ లావాదేవీలకు సర్వీస్ ఛార్జ్ రూ. 2 ప్లస్ జీఎస్టీగా ఉంటుంది.
రూ. 1 లక్ష కన్నా ఎక్కువ, రూ. 2 లక్షల వరకు ఎస్బీఐ ఆన్‌లైన్ ఐఎంపీఎస్ లావాదేవీలకు ఇప్పుడు రూ. 6 ప్లస్ జీఎస్టీగా రుసుము విధిస్తోంది. అలాగే, రూ. 2 లక్షల కన్నా ఎక్కువ, రూ. 5 లక్షల వరకు మొత్తాలకు, ఆన్‌లైన్ ఐఎంపీఎస్ లావాదేవీ సర్వీసు ఛార్జీలు రూ. 10 ప్లస్ జీఎస్టీగా ఉంటాయి.
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ :
ఫిబ్రవరి 1, 2026 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్ఫినియా మెటల్ క్రెడిట్ కార్డ్ కోసం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల నిబంధనలను సవరించింది. రివార్డ్ పాయింట్లను ఇప్పుడు నెలకు గరిష్టంగా 5 సార్లు రీడీమ్ చేసుకోవచ్చు. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. “ఫిబ్రవరి 1, 2026 నుంచి మీ ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్‌లోని రివార్డ్ పాయింట్లను నెలకు గరిష్టంగా 5 సార్లు రీడీమ్ చేసుకోవచ్చు.
కేవైసీ అప్‌డేట్ కోసం PNB బ్యాంక్ అలర్ట్ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లను ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని కోరింది. డిసెంబర్ 31, 2025 నాటికి మీ అకౌంట్ కేవైసీ అప్‌డేట్ గడువు ఉంటే.. ఫిబ్రవరి 2, 2026 నాటికి మీ కేవైసీని అప్‌డేట్ చేయాలని బ్యాంకు సూచించింది. ఒకవేళ కేవైసీ ఫెయిల్ అయితే మీ అకౌంట్ లావాదేవీలపై పరిమితులు వర్తిస్తాయి.