SBI Loan Rates : ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. రుణ వడ్డీ రేట్ల పెంపు.. భారీగా పెరగనున్న ఈఎంఐలు..!

SBI Loan Interest Rates : ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లను పెంచింది. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్, ఎంసీఎల్ఆర్ కొత్త రేట్లు 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. మీ లోన్ ఈఎంఐ పెరుగుతుందా? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

SBI Loan Interest Rates

  • ఎస్బీఐ లేటెస్ట్ అప్‌డేట్.. రుణ వడ్డీ రేట్ల పెంపు.. కొత్త రేట్లు ఇవే
  • ఎస్బీఐ హోం లోన్లు.. ఇక నెలవారీ ఈఎంఐలు పెరుగుతాయా?
  • ఎస్‌బీఐలో లోన్ తీసుకున్నారా? అక్టోబర్ 15 నుంచి కొత్త వడ్డీ రేట్లు

SBI Loan Rates : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాకింగ్ అప్‌డేట్.. మీరు ఎస్‌బీఐలో హోమ్ లోన్ లేదా ఇతర లోన్లు తీసుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఎస్‌బీఐ కొన్ని రుణ వడ్డీ రేట్లను పెంచేసింది. సంబంధిత లోన్లపై వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంది. దీంతో కొంతమంది రుణగ్రహీతల నెలవారీ ఈఎంఐలు కూడా పెరగవచ్చు. మరి కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఎవరిపై ప్రభావం పడుతుందో చూద్దాం..

ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రేట్లు పెంపు :
ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేటు (EBLR)ను 7.90 శాతం నుంచి 8.15 శాతానికి పెంచింది. అలాగే, రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ను 7.50 శాతం నుంచి 7.75 శాతానికి సవరించింది. ఈ కొత్త రేట్లు 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఈ మార్పులు సంబంధిత బెంచ్‌మార్క్‌లతో లింక్ అయిన లోన్లపై ప్రభావం చూపొచ్చు.. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకు నిబంధనలను బట్టి ఈఎంఐ పెరగడం లేదా రుణం తిరిగి చెల్లించే గడువు పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి కస్టమర్‌పై ప్రభావం ఒకేలా ఉండదు. లోన్ టైప్, వడ్డీ రీసెట్ తేదీ, మిగిలిన లోన్ మొత్తం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.

ఎంసీఎల్ఆర్ రేట్లలోనూ మార్పులు :
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లోనూ ఎస్‌బీఐ మార్పులు చేసింది. ఓవర్‌నైట్, ఒక నెల MCLR రేట్లను యథాతథంగా ఉంచగా, 3 నెలల నుంచి 3 సంవత్సరాల కాలపరిమితుల రేట్లను 0.15 శాతం పాయింట్లు పెంచింది. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఉపయోగించే ప్రామాణిక రేటు. అయితే, కస్టమర్‌కు వర్తించే అసలు వడ్డీ రేటు రుణ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పు లేదు :
మరోవైపు, ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లలో మార్పు లేదు. సాధారణ పౌరులకు 3.05శాతం నుంచి 6.60శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.55శాతం నుంచి 7.10శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చిన రేట్లు కొనసాగుతాయి.

Note : లోన్లు తీసుకున్న కస్టమర్లు తమకు వర్తించే లేటెస్ట్ వడ్డీ రేట్లు, ఈఎంఐ మార్పులను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా బ్యాంకు బ్రాంచుకు వెళ్లి చెక్ చేసుకోండి