LPG Gas Price Hike : కేంద్రం సంచలన నిర్ణయం.. వినియోగదారులకు మరో షాక్.. LPG సిలిండర్ ధరల పెంపు.. రూ.50 వరకు..!

LPG Gas Price Hike : వినియోగదారులకు భారీ షాకిచ్చేందుకు కేంద్ర రెడీ అవుతోంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచబోతుందని సమాచారం.

source said central may hike fuel price by 4 to 5 per litre and LPG cost by Rs 40 50 on each cylinder

LPG Gas Price Hike : పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు భారీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ. 997 పెంచిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోకముందే.. కేంద్రం మరోసారి జనాలకు భారీ షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుత అంచనాల ప్రకారం.. త్వరలోనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ. 4–5 వరకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 40–50 వరకు పెంచే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ ఈ పెంపునకు ఆమోదం లభిస్తే, 2022 నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి పెరిగినట్లవుతుంది.

చమురు మార్కెటింగ్ సంస్థలపై (OMCs) ఒత్తిడి పెరుగుతున్నందున ఇంధన ధరల పెంపునకు బలమైన అవకాశం ఉందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కాకపోతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఇన్నాళ్లూ ధరలు పెంచలేదని, ఫలితాలు వెల్లడైన కొన్ని రోజులకు ఈ పెంపు ఉండవచ్చని సమాచారం.

పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం. సరఫరాలో అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు, షిప్పింగ్ రిస్క్‌లు మరియు సుదీర్ఘ అస్థిరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఇది చమురు మార్కెటింగ్ సంస్థల ఇన్‌పుట్ ఖర్చులను పెంచింది. పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులు మరియు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై దాని ప్రభావాన్ని ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, రాబోయే 5–7 రోజుల్లో ధరల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపు వల్ల సామాన్యుల ఇంటి బడ్జెట్ మరియు రవాణా ఖర్చులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అటు చూస్తే చమురు సంస్థలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది.