Starlink vs Tata Nelco : భారత్‌లో స్టార్‌లింక్ దూకుడు, టాటా నెల్కో ప్లాన్.. శాటిలైట్ నెట్ ఎవరిది బెస్ట్? ధరలు తెలిస్తే షాకే!

Starlink vs Tata Nelco : భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ ఎలా ఉండబోతుంది? ధర, టెక్నాలజీ, టార్గెట్ మార్కెట్, సేవల ప్రారంభ స్టేటస్, కవరేజ్‌పై పూర్తి వివరాలివే..

Starlink vs Tata Nelco ( Image Credit to Original source )

  • భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ వార్, ఎవరి సేవలు బెస్ట్?
  • రూ.3,000కే స్టార్‌లింక్? టాటా నెల్కోతో పోటీ ఎలా ఉండబోతోంది?
  • స్టార్‌లింక్, టాటా నెల్కోతో మారనున్న ఇంటర్నెట్ గేమ్

Starlink vs Tata Nelco : భారత్‌లో ఇంటర్నెట్ రంగంలో కొత్త తరహా పోటీ మొదలైంది. ఫైబర్, మొబైల్ నెట్‌వర్క్ అందని ప్రాంతాలకు ఇక శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అందించే దిశగా ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ఇంటర్నెట్ రేసులో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా భారీ శాటిలైట్ నెట్‌వర్క్‌ను నిర్వహించే స్టార్‌లింక్ ఉంటే.. మరోవైపు టాటా గ్రూప్‌కు చెందిన నెల్కో తన ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగుతోంది.

స్టార్‌లింక్ ఏం అందించనుంది? :
స్టార్‌లింక్ సొంతంగా నిర్వహించే వేలాది లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా నేరుగా యూజర్లకు ఇంటర్నెట్ అందించాలని చూస్తోంది. భారత్‌లో నగరాలతో పాటు గ్రామీణ, మారుమూల ప్రాంతాలు, చిన్న వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలకు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ధర పరంగా పరిశీలిస్తే.. స్టార్‌లింక్ సర్వీసులకు నెలకు సుమారు రూ.3వేల నుంచి రూ.8వేలకు పైగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఇవేమి ఫైనల్ ధరలు కావు. అధికారిక ధర ప్రకటించే వరకు ఆగాల్సిందే.. శాటిలైట్ డివైజ్‌ల ఏర్పాటు కోసం అదనపు ఖర్చు కూడా అయ్యే అవకాశం లేకపోలేదు.

టాటా నెల్కో టార్గెట్ ఏంటి? :
స్టార్‌లింక్‌తో పోటీ పడుతున్న నెల్కో వ్యూహం కాస్త భిన్నంగా ఉంది. ప్రస్తుతం నెల్కోకు స్టార్‌లింక్‌లా సొంత శాటిలైట్ సిస్టమ్ అంటూ ఏది లేదు. పార్టనర్ కంపెనీల శాటిలైట్ సామర్థ్యంతో సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది.

Read Also : SBI vs PNB FD Rates : ఈ బ్యాంకుల్లో FD చేశారా? 2 ఏళ్ల FDపై ఎందులో రాబడి ఎక్కువంటే? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..!

సాధారణ ఇళ్ల కన్నా వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, సముద్ర రవాణా, విమానయాన, బ్యాంకింగ్ వంటి కీలక రంగాలపైనే నెల్కో ఎక్కువ ఫోకస్ పెడుతోంది. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లకు నేరుగా శాటిలైట్ కనెక్టివిటీ అందించే టెక్నాలజీపైనా వర్క్ చేస్తోంది. అయితే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

రేసులో ఎవరు ముందంటే? :

ప్రస్తుతం చూస్తే.. భారత్‌లో సాధారణ కస్టమర్లకు సర్వీసులను ప్రారంభించే విషయంలో స్టార్‌లింక్ ముందంజలో కనిపిస్తోంది. అయితే, స్పెక్ట్రమ్, నియంత్రణ అనుమతులు, శాటిలైట్ వినియోగానికి సంబంధించిన నిబంధనలు చాలా కీలకం. కానీ, నెల్కో మాత్రం సంస్థాగత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని నెమ్మదిగా శాటిలైట్ సర్వీసులపై రంగం సిద్ధం చేస్తోంది.

యూజర్లకు బెనిఫిట్ ఏంటి? :
ఈ శాటిలైట్ ఇంటర్నెట్ రేసులో ఎవరు గెలుపును నిర్ణయించేది కేవలం ముందుగా సర్వీసులు ఎవరూ ప్రారంభించారు అనేది కాదు.. ఇందులో సర్వీసు ప్లాన్ల ధర, ఇంటర్నెట్ స్పీడ్, కవరేజ్, డివైజ్‌ ఇన్ స్టలేషన్ ఖర్చు, సర్వీసు క్వాలిటీ, నమ్మకమైన కనెక్టివిటీ కీలకంగా మారనున్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే.. గ్రామీణ మూరుమూల ప్రాంతాల్లోని ఇళ్లకు శాటిలైట్ ఇంటర్నెట్‌ అందించాలని స్టార్‌లింక్ భావిస్తుంటే.. సంస్థలు, కీలక రంగాల కనెక్టివిటీలో టాటా నెల్కో ముందుకు సాగుతోంది. ఈ రేసులో ఎవరు ముందుగా సర్వీసులను అందుబాటులోకి తెస్తారు? యూజర్లను ఆకట్టకునేలా ఎవరు తక్కువ ధరకే ప్లాన్లను అందిస్తారో చూడాలి..