Summer AC Tips : మీ AC కూలింగ్ తగ్గిందా? టెక్నీషియన్ వద్దు.. ఈ చిన్న సెట్టింగ్స్ మార్చితే ఏసీ సూపర్ కూలింగ్!

Summer AC Tips : మీ ఏసీని 24 డిగ్రీలకు సెట్ చేసినా కూలింగ్ కావడం లేదా? ఫిల్టర్ మురికిగా ఉండటం, గ్యాస్ తక్కువగా ఉండటం లేదా గదిలో వేడి వంటి కారణాలు ఉండవచ్చు. ఈ సింపుల్ ట్రిక్స్ ఓసారి ట్రై చేయండి.

Summer AC Tips

  • మీ ఏసీలో కూలింగ్ సమస్య ఉందా?
  • 24 డిగ్రీలకు సెట్ చేసినా గది కూలింగ్ అవ్వడం లేదా?
  • ఏసీ కూలింగ్ కాకపోవడానికి అసలు కారణాలివే

Summer AC Tips : అసలే సమ్మర్.. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కూడా ఇంకా ఎక్కువైంది. ఇంట్లో ఏసీ లేదా కూలర్ లేకుంటే ఉండటం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏసీ ఆన్ చేసినా టెంపరేచర్ 24 డిగ్రీలకు సెట్ చేసినా గది వేడిగా, తేమగా అనిపిస్తోందా?

మీకు చెమటలు పట్టి, నిద్ర పట్టడం లేదా? ఇది చాలా సాధారణ సమస్య. ఏసీ నడుస్తున్నా, గది కూలింగ్ అవ్వడం లేదంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఏసీ కూలింగ్ కాకపోవడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మురికి ఫిల్టర్లు, కాయిల్స్ :
ఏసీ ఫిల్టర్లు, లోపలి కాయిల్స్‌లో (కూలింగ్ కాయిల్స్) దుమ్ము, ధూళి పేరుకుపోవడం. ఫిల్టర్లు మూసుకుపోయినప్పుడు, చల్లని గాలి లోపలికి రాదు. ఏసీ నుంచి కేవలం గాలి మాత్రమే వస్తుంది. కానీ, కూలింగ్ అందించదు.

రిఫ్రిజెరెంట్ తక్కువ :
ఏసీ లీక్ అయినా లేదా అందులో రిఫ్రిజెరెంట్ తక్కువగా ఉన్నా అది సరిగ్గా కూలింగ్ అవ్వదు. 24 డిగ్రీల వద్ద కూడా గది కూలింగ్ కాదు. ఈ సమస్య పాత ఏసీలలో ఎక్కువగా కనిపిస్తుంది.

గది పరిమాణం కన్నా చిన్న ఏసీ :
గది పెద్దగా ఉండి ఏసీ టన్నేజీ తక్కువగా ఉంటే (120-150 చదరపు అడుగుల గదికి ఒక టన్ ఏసీ), అప్పుడు అది గది మొత్తాన్ని కూలింగ్ చేయలేదు. తెరిచి ఉన్న కిటికీలు, తలుపులు, కర్టెన్లు లేకపోవడం, పైకప్పుపై నేరుగా పడే సూర్యరశ్మి లేదా సరిగా లేని ఇన్సులేషన్ కారణంగా గదిలోకి వేడి ప్రవేశించవచ్చు . బయటి వేడి గాలి నిరంతరం లోపలికి వస్తూ ఉంటే ఏసీ గదిని కూలింగ్ చేయలేదు.

ఫ్యాన్ స్పీడ్, మోడ్ సరిగ్గా లేకపోవడం :
చాలామంది తరచుగా ఏసీని “ఫ్యాన్ మోడ్”లో ఉంచుతారు లేదంటే ఫ్యాన్ స్పీడ్ చాలా ఎక్కువగా సెట్ చేస్తారు. దీని కారణంగా కూలింగ్ తక్కువగా ఉంటుంది.

ఏసీ అవుట్‌డోర్ యూనిట్ :
వేడి ప్రదేశంలో నేరుగా సూర్యరశ్మి తగిలే చోట లేదా మూసి ఉన్న ప్రదేశంలో ఉంటే సరిగ్గా పనిచేయదు.

Read Also : HDFC Credit Card : మీకు HDFC క్రెడిట్ కార్డు ఉందా? ఈ కొత్త రూల్స్ అర్జెంట్‌గా తెలుసుకోండి.. లేదంటే భారీగా నష్టపోతారు..!

ఏసీలో సమస్యను ఎలా పరిష్కరించాలి? :

  • ప్రతి 15-20 రోజులకు ఏసీ ఫిల్టర్‌ను క్లీన్ చేయండి.
  • సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోండి.
  • గది కిటికీలకు మందపాటి తెరలు వేయాలి.
  • సాయంత్రం వేళల్లో కిటికీలు మూసి ఉంచండి.
  • ఏసీని 24°C వద్ద ‘కూల్ మోడ్’లో ఫ్యాన్ స్పీడ్ ‘ఆటో’ లేదా మీడియంలో ఉంచండి.
  • గ్యాస్ తక్కువగా ఉంటే వెంటనే టెక్నీషియన్‌ను పిలవండి.
  • గది సైజుకు సరిపోయే సామర్థ్యం ఉన్న ఏసీని వాడండి.

ఏసీ 24 డిగ్రీల వద్ద రన్ అవుతున్నా గది కూలింగ్ కాదు. చాలా సందర్భాలలో మురికి, గ్యాస్ కొరత లేదా గదిలో వేడిగాలి ఉండటమే ఈ సమస్యకు కారణంగా చెప్పొచ్చు. మీ ఏసీని రెగ్యులర్‌గా క్లీన్ చేసి సర్వీస్ చేయించాలి. గది నుంచి వేడి బయటకు వెళ్లిపోతే ఏసీ కూడా తొందరగా కూలింగ్ అవుతుంది. తద్వారా పవర్ వినియోగం కూడా తగ్గుతుంది.

వేసవిలో కూలింగ్ ఎయిర్ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోండి. పై సూచనలు పాటించిన తర్వాత కూడా సమస్య అలానే ఉంటే మాత్రం వెంటనే ఏసీ టెక్నీషియన్‌ను పిలవడం బెటర్.