×
Ad

Suzuki Access : కొంటే ఇలాంటి స్కూటర్ కొనాలి.. సుజుకి యాక్సెస్ స్కూటర్ కొత్త అవతార్.. మీ బడ్జెట్ ధరలోనే..!

Suzuki Access : సుజుకి యాక్సెస్ ఏబీఎస్ కొత్త స్కూటర్ వచ్చేసింది. ఈ కొత్త యాక్సెస్ ఏబీఎస్ అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ధర ఎంతంటే?

Suzuki Access

  • భారత మార్కెట్లో కొత్త స్కూటర్ సుజుకి యాక్సెస్ ABS లాంచ్
  • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) సేఫ్టీ ఫీచర్లు
  • యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఏబీఎస్ ఎడిషన్ ధర రూ. 98,378 (ఎక్స్-షోరూమ్)

Suzuki Access : కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్లో కొత్త స్కూటర్ సుజుకి యాక్సెస్ ABS లాంచ్ చేసింది. ఈ కొత్త యాక్సెస్ ఏబీఎస్ అనేది కంపెనీ పాపులర్ యాక్సెస్ స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్.

ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో వస్తోంది. కంపెనీ కొత్త స్కూటర్‌లో సేఫ్టీని మరింత అప్‌డేట్ చేసింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను చేర్చింది. మెరుగైన సేఫ్టీని అందిస్తుంది. పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

సుజుకి యాక్సెస్ ఏబీఎస్ స్కూటర్ ధర :
సుజుకి యాక్సెస్ ఏబీఎస్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ఈ కొత్త సుజుకి యాక్సెస్ ఏబీఎస్ ధర రూ. 92,328 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ టీఎఫ్టీ ఏబీఎస్ ఎడిషన్ ధర రూ. 98,378 (ఎక్స్-షోరూమ్)కు ఆఫర్ చేస్తోంది. సుజుకి యాక్సెస్ ఏబీఎస్ స్కూటర్ 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : iPhone 16 Plus : ఆఫర్ అదిరింది బ్రో.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.21,500 డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసం..!

మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బీజ్ ఉన్నాయి. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఫీచర్ సుజుకి యాక్సెస్ వీల్స్ లాక్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. సడెన్ బ్రేక్‌లు వేసినప్పుడు రైడర్ స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. స్కూటర్‌పై మెరుగైన కంట్రోలింగ్ అందిస్తుంది.

సుజుకి యాక్సెస్ ఏబీఎస్ స్కూటర్ ఇంజిన్ :
కొత్త సుజుకి యాక్సెస్ ఏబీఎస్ స్కూటర్ 124cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 6,500rpm వద్ద 8.43bhp, 5,000rpm వద్ద 10.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి యాక్సెస్ ఏబీఎస్ స్కూటర్ స్పెషల్ ఆఫర్లు :
సుజుకి యాక్సెస్ ఏబీఎస్ స్కూటర్ లాంచ్‌తో పాటు కంపెనీ స్పెషల్ ఫైనాన్సింగ్ ఆప్షన్‌ కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ కేవలం 6.99 శాతం వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా అందిస్తోంది. అదనంగా, ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది వరకు రూ. 5వేల విలువైన వోచర్‌ గెలుచుకోవచ్చు.