Tata Curvv Series X : రూ.9.99 లక్షలకే టాటా కర్వ్ కొత్త సిరీస్ X కారు.. ఏ వేరియంట్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయంటే!
Tata Curvv Series X : టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ కొత్త లైనప్‌ను రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. స్మార్ట్ ఎక్స్ నుంచి అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ వరకు అన్ని వేరియంట్ల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- September 5, 2026 / 07:44 PM IST
Tata Curvv Series X
- టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ వచ్చేసింది..
- మీ బడ్జెట్‌కు సరిపోయే వేరియంట్ ఇదేనా?
- కొత్త సిరీస్ ఎక్స్ ధరలు, ఫీచర్లు ఇవే
- టాటా కర్వ్ సిరీస్ ఎక్స్‌లో అదిరిపోయే ఫీచర్లు
Tata Curvv Series X : కొత్త కారు కొంటున్నారా? కొత్త SUV కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. టాటా మోటార్స్ నుంచి అద్భుతమైన కారు వచ్చేసింది. కంపెనీ ప్రముఖ SUV కూపే టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ లైనప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
బడ్జెట్ ధరలో పలు వేరియంట్లు అందిస్తున్న టాటా, బేస్ మోడల్ నుంచే సేఫ్టీ, సౌకర్యం వంటి కీలక ఫీచర్లను అందిస్తోంది. కొత్త కర్వ్ సిరీస్ ఎక్స్ మోడళ్లలో స్మార్ట్ ఎక్స్, ప్యూర్ ఎక్స్ ప్లస్, క్రియేటివ్ ఎక్స్ ప్లస్, అకంప్లిష్డ్ ఎక్స్, అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో కొన్ని వేరియంట్లు డార్క్ ఎడిషన్ ఆప్షన్‌తోనూ అందుబాటులో ఉంటాయి.
స్మార్ట్ ఎక్స్ :
ఈ లైనప్‌లో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఎక్స్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఆర్-కంఫర్ట్ సీట్లు, ఆర్17 ఏరో స్టయిల్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్‌తో ఈజీసిప్ కప్ డాక్స్, మల్టీ-డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, EBDతో ABS, LED హెడ్‌ల్యాంప్స్, DRLs, LED టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ గైడ్ పార్కింగ్ అసిస్ట్ లభిస్తాయి.
ప్యూర్ ఎక్స్, ప్యూర్ ఎక్స్ ప్లస్ :
ప్యూర్ ఎక్స్ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 10.25-అంగుళాల హార్మన్ అల్ట్రా వ్యూ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ కీ, పాసివ్ ఎంట్రీ/స్టార్ట్, 6 స్పీకర్లు, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉన్నాయి.
Read Also : Bank of Baroda FD : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ బ్యాంకులో 444 రోజుల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
ప్యూర్ ఎక్స్ ప్లస్ ధర రూ.11.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఓస్టర్ వైట్ లెదరెట్ సీట్లు, ఆర్17 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. డార్క్ ఎడిషన్ ధర రూ.11.99 లక్షల నుంచి ఉంటుంది.
క్రియేటివ్ ఎక్స్ ప్లస్ :
క్రియేటివ్ ఎక్స్ ప్లస్ ధర రూ.12.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, R18 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 360-డిగ్రీ 3D సరౌండ్-వ్యూ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్, 10.25-అంగుళాల డిజిటల్ కాక్‌పిట్ ఉన్నాయి. టీపీఎంఎస్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఇల్యూమినేటెడ్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ లభిస్తాయి.
అకంప్లిష్డ్ ఎక్స్, అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ :
టాప్ వేరియంట్ అకంప్లిష్డ్ ఎక్స్, అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్‌లో ఎల్2 అడాస్, సెక్విన్షియల్ లైట్ సబేర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, టెయిల్ ల్యాంప్స్, వెల్కమ్, గుడ్‌బై యానిమేషన్లు, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.
జేబీఎల్ ఆడియోతో ఇమ్మర్సివ్ సౌండ్ సూట్, 9 స్పీకర్లతో 12.3-అంగుళాల హార్మన్ అల్ట్రా వ్యూ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ట్విన్-జోన్ క్లైమేట్ కంట్రోల్, బ్రీత్ ఐక్యూ ఎయిర్ ప్యూరిఫైయర్, iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా ఇంటిగ్రేషన్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్వీఎమ్ కూడా ఉన్నాయి. ఇక అకంప్లీషడ్ ఎక్స్ ప్లస్‌లో జెస్చర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్ అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు.
