×
Ad

Tata Punch vs Nexon EV : ఫ్యామిలీ సేఫ్టీ ఫస్ట్, టాటా పంచ్ ఈవీ vs నెక్సాన్ ఈవీ ఫుల్ రివ్యూ, ఏది కొంటే బెటర్? రేంజ్ ఎంతంటే?

Tata Punch vs Tata Nexon EV : టాటా కార్లలో ఏది బెస్ట్. మీ ఫేవరెట్ కారు ఏంటి? టాటా పంచ్ ఈవీ కొంటారా? టాటా నెక్సాన్ ఈవీ కొంటారా? ఈ రెండింటిలో మీరు ఏది కొంటారు? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published On : February 24, 2026 / 05:56 PM IST

Tata Punch vs Nexon EV

  • టాటా పంచ్, టాటా నెక్సాన్ ఈవీ ఫుల్ ఫీచర్లు బ్యాటరీ వివరాలు
  • టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రూ. 9.69 లక్షల ఎక్స్-షోరూమ్
  • టాటా నెక్సాన్ ఈవీ రూ. 12.49 లక్షల ఎక్స్-షోరూమ్
  • ఈ రెండు ఈవీ కార్ల ధర మధ్య వ్యత్యాసం రూ. 2 లక్షలు

Tata Punch vs Tata Nexon EV: టాటా కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ భారతీయ కార్ల తయారీదారు టాటా మోటార్స్ భారత మార్కెట్లో అనేక కొత్త మోడల్ కార్లను అందిస్తోంది. టాటా ఈవీ విభాగంలో కూడా అద్భుతమైన కార్లను ఆఫర్ చేస్తోంది. ఇటీవలే టాటా ఫేస్‌లిఫ్ట్ పంచ్ ఈవీ కారును లాంచ్ చేసింది.

టాటా ఈ కేటగిరీలో నెక్సాన్ ఈవీని కూడా అందిస్తోంది. టాటా అత్యంత పాపులర్ ఈవీలలో ఇదొకటి. మీరు కూడా భవిష్యత్తులో టాటా ఈవీ కారు కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే. ఈ రెండు కార్లలో మీకు ఏది బెస్ట్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టాటా పంచ్, టాటా నెక్సాన్ ఈవీ ధర :
రెండు టాటా ఈవీల ధరల విషయానికి వస్తే.. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాటా నెక్సాన్ ఈవీ రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ధర రూ. 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటుంది. మీరు బడ్జెట్‌ ధరలో పంచ్ ఈవీ లేదా నెక్సాన్ ఈవీ ఏదైనా కొనేసుకోవచ్చు.

Read Also : Vivo V70 FE Launch : వివో లవర్స్‌కు పండగే.. వివో V70 FE ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు కేక, ధర ఎంత ఉండొచ్చంటే?

టాటా పంచ్, టాటా నెక్సాన్ ఈవీ బ్యాటరీ, రేంజ్ :
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. 30kWh బ్యాటరీ ప్యాక్, 40kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. 40kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 468 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. నెక్సాన్ ఈవీ 30kWh బ్యాటరీ ప్యాక్, 45kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 489 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది.

ఈ రెండు ఈవీల మధ్య రేంజ్ వ్యత్యాసం 21 కి.మీ. ఛార్జింగ్ పరంగా పంచ్ ఈవీ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. నెక్సాన్ ఈవీ 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అయ్యేందుకు 40 నిమిషాలు పడుతుంది.

టాటా పంచ్, టాటా నెక్సాన్ ఈవీ ఫీచర్లు :
కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-బేస్డ్ కంట్రోల్స్, రోటరీ డయల్స్, లెథరెట్ అప్హోల్స్టరీ, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్ డిజైన్ ఉంటాయి. పంచ్ ఈవీలో ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కనెక్ట్ కార్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఫీచర్లలో ప్రీమియం డ్యూయల్-టోన్ ఇంటీరియర్, వైడ్ అండ్ కంపర్టబుల్ సీటింగ్, సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.