Tax Deadline 2026 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మార్చి 31లోగా ఈ 3 పనులు చేయకపోతే భారీగా నష్టపోతారు జాగ్రత్త..

Tax Deadline 2026: మార్చి 31వ తేదీలోగా పన్ను సంబంధిత పనులను అన్ని పూర్తి చేయడం బెటర్. ఈ మూడు పనులు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Tax Deadline 2026 ( Image Credit : AI )

  • పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 3 పనులివే
  • మార్చి 31 వరకు మాత్రమే ఫైనల్ డెడ్ లైన్, భారీగా పెనాల్టీ పడొచ్చు
  • విదేశీ పన్ను క్రెడిట్ ఫారం 67 వెంటనే దాఖలు చేయాలి

Tax Deadline 2026 : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అప్‌డేట్.. మార్చి 31వ తేదీ దగ్గరపడింది. పన్ను చెల్లింపునకు ఇంకా 2 రోజుల సమయం మిగిలి ఉంది. పన్ను సంబంధిత నియమాలకు ఇదే చివరి గడువు. మీరు ఎలాంటి పెనాల్టీలు పడకుండా ఉండాలంటే ఈ పనులను మార్చి 31వ తేదీన లేదా అంతకంటే ముందు పూర్తి చేయండి. పూర్తి విషయాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం..

1 : అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(8A) అప్‌డేట్ ఆదాయపు పన్ను రిటర్న్‌కు వర్తిస్తుంది. ఈ నిబంధన ప్రకారం.. పన్ను చెల్లింపుదారులు గతంలో చేసిన ఏవైనా తప్పులు లేదా ఇంతకుముందు వెల్లడి చేయని ఆదాయాన్ని బహిర్గతం చేయవచ్చు. అప్‌డేట్ రిటర్న్ పన్ను చెల్లింపుదారులకు తమ తప్పులను సరిదిద్దుకునేందుకు మరో ఛాన్స్ అందిస్తుంది.

పన్ను చెల్లింపుదారులు 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి అప్ డేట్ రిటర్న్‌ను 2026 మార్చి 31 లోగా దాఖలు చేయవచ్చు. ఇలా చేయడంలో విఫలమైతే లేదా ఏదైనా పొరపాటు జరిగితే భారీగా జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి రావచ్చు.

Read Also : New Big Rules April 1 : ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్.. ఇక తప్పించుకోలేరు.. కారు, బైక్, క్యాష్ పేమెంట్లు చేసే ముందు జాగ్రత్త!

2 : విదేశీ పన్ను క్రెడిట్ (ఫారం 67) :
ఇప్పటికే విదేశాలలో ఈ నిబంధన అమల్లో ఉంది. పన్ను విధించే ఆదాయంపై పన్ను చెల్లింపుదారులు తప్పక సమర్పించాలి. ఫారిన్ టాక్స్ క్రెడిట్ (ఫారం 67) ద్వారా డ్యూయల్ టాక్స్ నివారించవచ్చు.

పన్ను చెల్లింపుదారులు ఫారం 67తో పాటు విదేశీ ఆదాయ ధృవీకరణ పత్రం, దానిపై చెల్లించిన పన్నుల వివరాలను సమర్పించాలి. ఈ నిబంధన విదేశాలలో ఉద్యోగం చేస్తున్న లేదా విదేశీ వనరుల నుంచి ఆదాయం పొందుతున్న వ్యక్తులకు వర్తిస్తుంది. ఫారం 67 దాఖలుకు గడువును 2026 మార్చి 31గా నిర్ణయించారు.

3 : అడ్వాన్స్ టాక్స్ :
మీ అడ్వాన్స్ టాక్స్ మార్చి 31వ తేదీలోగా చెల్లించేలా చూసుకోండి. ఎఫ్&ఓ, ఫ్రీలాన్సింగ్, అద్దె గృహాలు, మూలధన లాభాలు, వడ్డీ నుంచి డబ్బు సంపాదించే వారికి తప్పనిసరి. ఇలాంటి వ్యక్తులు తమ పన్ను బాధ్యత తగ్గింపు కోసం 2026 మార్చి 31వ తేదీలోగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించవచ్చు. ఆలస్యంగా చెల్లించిన పక్షంలో సెక్షన్లు 234బీ, 234సీ కింద చెల్లించని మొత్తంపై నెలకు ఒక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.