ITR TDS Credit : టాక్స్ పేయర్లు ఎగిరిగంతేసే న్యూస్.. ఇక మీ ITR ఫైల్ చేయకున్నా TDS బెనిఫిట్ పొందొచ్చు..!
ITR TDS Credit : ఆదాయపు పన్ను కేసులో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్.. ఫారం 26AS ఆధారంగా వ్యక్తి ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చినా వాస్తవానికి ఎలాంటి పన్ను విధించరాదని ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది.
- Sreehari A
- Updated on- May 29, 2026 / 07:49 PM IST
ITR TDS Credit ( Image Credit : AI )
- టాక్స్ పేయర్లకు భారీ గుడ్ న్యూస్
- ఐటీఆర్ ఫైల్ చేయకున్నా టీడీఎస్ బెనిఫిట్ పొందొచ్చు
- టీడీఎస్‌కు క్రెడిట్ ఇవ్వాలని ఐటీ శాఖకు ట్రిబ్యునల్ ఆదేశాలు
ITR TDS Credit : టాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్.. మీరు ఐటీఆర్ ఫైల్ చేయకున్నా టీడీఎస్ బెనిఫిట్ పొందవచ్చు. ఆదాయపు పన్ను కేసులో ముంబైకి చెందిన ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనాన్ని అందించింది.
ఫారం 26AS ఆధారంగా ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చేలా పరిగణిస్తే.. ఆ ఆదాయంపై మినహాయించిన టీడీఎస్ బెనిఫిట్ కూడా టాక్స్ పేయర్ పొందాలని ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. కేవలం ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయలేదనే కారణంతో టీడీఎస్ క్రెడిట్‌ను నిలిపివేయరాదని స్పష్టం చేసింది.
అసలు కేసు ఏంటి? ఏం జరిగిందంటే? :
నవీ ముంబైకి చెందిన పన్ను చెల్లింపుదారునికి సంబంధించిన ఈ కేసులో (ITR TDS Credit) ఆదాయపు పన్ను శాఖ 2010-11 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను మదింపును నిర్ణయించింది. ఆ శాఖ ఫారం 26AS, ఇతర రికార్డుల నుంచి కొంత ఆదాయ సమాచారాన్ని పొందింది. ఆ వ్యక్తి ఐటీఆర్ దాఖలు చేయలేదు.
అలాగే ఐటీ శాఖ నోటీసుకు కూడా ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఆదాయపు పన్ను అధికారి ఏకపక్షంగా వ్యవహరించి ఫారం 26ASలో చూపిన మొత్తం మొత్తాన్ని పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించారు. అయితే, ఆ ఆదాయంపై ఇప్పటికే మినహాయించిన టీడీఎస్‌ను డిపాజిట్ చేయలేదు.
ట్రిబ్యునల్ ఏం చెప్పింది? :
ఆదాయ శాఖ మొత్తం ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తీసుకువస్తోంది. దీనిపై ఇప్పటికే డిపాజిట్ టీడీఎస్ బెనిఫిట్ కూడా ఇవ్వాలని పన్ను చెల్లింపుదారులు ఐటీఏటీ ముందు వాదించారు. లేని పక్షంలో అది ద్వంద్వ పన్ను విధించినట్టే.
ట్రిబ్యునల్ ఈ వాదనను అంగీకరించి ప్రభుత్వానికి ఇప్పటికే డిపాజిట్ చేసిన టీడీఎస్‌ను కేవలం సాంకేతిక కారణాలతో విస్మరించలేమని పేర్కొంది. అనంతరం ఐటీఏటీ, ఫారం 26ASను పరిశీలించి టీడీఎస్‌కు క్రెడిట్ అందించాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.
సాధారణ పన్ను చెల్లింపుదారులకు లాభమా? :
ఫారం 26AS లేదా ఇతర పన్ను రికార్డులలో ఆదాయాన్ని రిపోర్టు చేయొచ్చు. ఏదైనా కారణంతో ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇది వర్తిస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఏదైనా ఆదాయంపై పన్ను వసూలు చేయాలనుకుంటే, ఆ ఆదాయంపై ఇప్పటికే మినహాయించి ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన మొత్తం టీడీఎస్ కూడా తప్పనిసరిగా గుర్తించాలి.
నిపుణుల ప్రకారం.. 26AS స్థానంలో కొత్త సమాచార వ్యవస్థ ఫారం ఉంటుంది. ప్రాథమిక సూత్రం మాత్రం మారదు. పన్ను చెల్లింపుదారుల పేర్ల మీద డిపాజిట్ చేసిన పన్నులను విస్మరించరాదు. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి సందర్భాలలో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
