Tesla EVs Recall : టెస్లాకు భారీ షాక్.. 29.8 లక్షల EV కార్లు రీకాల్! చైనాలో ఏం జరిగింది? అసలు సమస్య ఇదే!
Tesla EVs Recall : భద్రతా లోపాల దృష్ట్యా టెస్లా చైనాలో 29.8 లక్షల ఈవీ కార్లను రీకాల్ చేసింది. డోర్ హ్యాండిల్స్‌పై భద్రతా లోపాల ఆందోళనలు, సైబర్‌క్యాబ్ రాక ముందే చైనాలో జరిగిన పరిణామాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- August 23, 2026 / 11:20 AM IST
Tesla EVs Recall
- టెస్లా చైనాలో సుమారు 29.8 లక్షల ఈవీలు రీకాల్
- ఈ ఈవీలలోడోర్ హ్యాండిల్స్ భద్రతపై ఆందోళనలు
- టెస్లా సైబర్‌క్యాబ్ త్వరలో అమెరికాలో విడుదల
Tesla EVs Recall : చైనాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై భద్రతా ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు విద్యుత్ వ్యవస్థ పనిచేయకపోతే, బయటకు రావడానికి ఉపయోగించే డోర్ హ్యాండిల్‌నే సమస్యగా మారే అవకాశం ఉందన్న కారణంతో భారీ రీకాల్ చేపట్టింది.
చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ ప్రకారం.. టెస్లా సుమారు 29.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేసింది. ఇందులో మోడల్ 3, మోడల్ Y, మోడల్ X, మోడల్ S వాహనాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రమాద సమయంలో హైడ్ డోర్ హ్యాండిల్స్ కారణంగా ప్రయాణికులు డోర్లు త్వరగా ఓపెన్ అవ్వకపోవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే చైనాలో టెస్లా కార్లలో భారీ మొత్తంలో రీకాల్ చేస్తోంది.
డోర్ హ్యాండిల్స్ తెరుచుకోవు :
వాస్తవానికి, ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ, పవర్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు సాధారణంగా పనిచేసే ఫీచర్లు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కారులో ఉన్నవారు బయటకు రావడం, బయట ఉన్నవారు డోర్ తెరవడం కష్టంగా మారవచ్చని చైనా నియంత్రణ సంస్థ పేర్కొంది.
Read Also : Vivo V70 Elite : వివోనా మజాకా.. 50MP ట్రిపుల్ కెమెరా ఫోన్ ఇప్పుడు రూ. 11వేలు తగ్గింపుతో.. ఎలాగంటే?
చైనాలో వరుస ప్రమాదాల ఎఫెక్ట్ :
చైనాలో ఈవీలకు సంబంధించిన వరుస ప్రమాదాల నేపథ్యంలో డోర్ హ్యాండిల్స్ విషయంలో ఆందోళన రేకిత్తిస్తోంది. ఇదే సమయంలో చైనా మార్కెట్లో స్థానిక తయారీదారులు కూడా భద్రతా కారణాలతో పెద్ద సంఖ్యలో వాహనాలను రీకాల్ చేస్తున్నారు.
టెస్లా సైబర్ క్యాబ్ రెడీ :
మరోవైపు.. టెస్లా సైబర్ క్యాబ్ పై కూడా ఫోకస్ పెట్టింది. స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా ఈ ఆటో వెహికల్ రాబోతుంది. టెస్లా రోబోటాక్సీ వ్యూహంలో ఇదే కీలకం. కంపెనీ సిబ్బంది కోసం ప్రైవేట్ రోడ్లపై సర్వీసు ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది.
గత జూన్‌లో సైబర్‌క్యాబ్ ప్రొడక్షన్ వెర్షన్ టెస్టింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే, కొత్త రోబోటాక్సీ కలను నిజం చేసే తరుణంలోనే టెస్లా ఈ భారీ రీకాల్ ఎదుర్కొంటోంది. ఈవీ సేఫ్టీ విషయంలో చిన్న డిజైన్ అంశం కూడా ఎంత కీలకమో అనేది టెస్లా ఈవీ రీకాల్ ద్వారా తెలుస్తోంది.
