Top 10 5-Star Safest Cars : ఈ దీపావళికి సేఫ్టీనే ఫస్ట్ ఛాయిస్.. రూ.15 లక్షలలోపు 5 స్టార్ రేటింగ్ అందించే టాప్ 10 కార్లు ఇవే!

Top 10 5-Star Safest Cars : ఈ దీపావళికి రూ.15 లక్షలలోపు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? టాటా పంచ్ నుంచి కియా సైరోస్ వరకు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన టాప్ 10 కార్లు, ధరలు, క్రాష్ టెస్ట్ స్కోర్లు, ఇంజిన్ వివరాలేంటో తెలుసుకుందాం..

Top 10 5-Star Safest Cars

  • మైలేజీ కంటే సేఫ్టీ ముఖ్యమా?
  • రూ.15 లక్షలలోపు టాప్ 10 సేఫెస్ట్ 5 స్టార్ కార్లు
  • తక్కువ ధరలో అదిరిపోయే సేఫ్టీ ఇచ్చే కార్లు
  • దీపావళి కార్ కొనుగోలుకు బెస్ట్ ఛాయిస్..

Top 10 5-Star Safest Cars : కొత్త కారు కొనాలంటే ఒకప్పుడు మైలేజీ ఎంత వస్తుంది? ధర ఎంత? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఫ్యామిలీతో ప్రయాణించేటప్పుడు ఎంత సేఫ్టీ ఉంటుంది? ప్రమాదం జరిగినా ప్రయాణికులకు ఎంత సేఫ్ అనే విషయాలకే కొనుగోలుదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

దీంతో కార్ల తయారీ కంపెనీలు కూడా సేఫ్టీ ఫీచర్లపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. ముఖ్యంగా భారత్ NCAP, గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ సాధించిన కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.15 లక్షలలోపే ఉందా? అయితే మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న ఈ టాప్ 10 కార్లపై ఓ లుక్కేయండి..

1. టాటా పంచ్ (Tata Punch) :
రూ.5.75 లక్షల ప్రారంభ ధరతో టాటా పంచ్ బడ్జెట్ మైక్రో SUV కొనేవారికి మంచి ఆప్షన్. 2026 మోడల్ భారత్ NCAPలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 30.58 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 49కి 45 పాయింట్లు సాధించింది. పెట్రోల్, CNG ఆప్షన్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా లభిస్తోంది.

2. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) :
రూ.6 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 29.65, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 44.90 పాయింట్లు దక్కించుకుంది. పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లలో లభిస్తుంది.

3. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) :
రూ.6.31 లక్షల ప్రారంభ ధరతో డిజైర్ గ్లోబల్ NCAP, భారత్ NCAP రెండింటిలోనూ 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 29.46, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 41.57 పాయింట్లు సాధించింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది.

4. టాటా నెక్సాన్ (Tata Nexon) :
రూ.7.40 లక్షల ప్రారంభ ధరతో వచ్చే నెక్సాన్ భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 29.41, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 43.83 పాయింట్లు పొందింది. పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లు ఉన్నాయి.

5. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) :
రూ.7.79 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ SUV భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 29.36, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 43 పాయింట్లు సాధించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి..

6. స్కోడా కైలాక్ (Skoda Kylaq) :

రూ.7.59 లక్షల ప్రారంభ ధరతో వచ్చే కైలాక్ భారత్ NCAPలో అడల్ట్ ప్రొటెక్షన్‌కు 30.88, చైల్డ్ ప్రొటెక్షన్‌కు 45 పాయింట్లు సాధించింది. 5 స్టార్ రేటింగ్‌తో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ కారు స్పెషాలిటీగా చెప్పొచ్చు..

7. హోండా అమేజ్ (Honda Amaze) :
రూ.7.65 లక్షల ప్రారంభ ధరతో థర్డ్ జనరేషన్ అమేజ్ భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 28.33, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 40.81 పాయింట్లు దక్కించుకుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

Read Also : EPFO WhatsApp Services : ఇక వాట్సప్‌లోనే PF బ్యాలెన్స్.. పాస్‌బుక్ డౌన్‌లోడ్ కూడా.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

8. మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) :
రూ.7.50 లక్షల ప్రారంభ ధరతో వచ్చే బ్రెజ్జా భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 30.41, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 43 పాయింట్లు పొందింది. అయితే, ఈ రేటింగ్ ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్, CNG ఆప్షన్లు ఉన్నాయి.

9. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) :
రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో లభించే కొత్త జనరేషన్ వెన్యూ భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 31.15, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 44.46 పాయింట్లు పొందింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

10. కియా సైరోస్ (Kia Syros) :
రూ.8.42 లక్షల ప్రారంభ ధరతో వచ్చే కియా సైరోస్ మంచి స్పేస్, రూమీ క్యాబిన్ కోరుకునేవారికి అద్భుతమైన ఆప్షన్. భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్‌తో పాటు అడల్ట్ ప్రొటెక్షన్‌లో 30.21, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 44.42 పాయింట్లు సాధించింది. అయితే, ఈ రేటింగ్ ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది.

కారు కొనేముందు ఈ విషయం గుర్తుంచుకోండి :
ఈ 10 కార్లు సేఫ్టీ విషయంలో మంచి స్కోరు సాధించినప్పటికీ, క్రాష్ టెస్ట్ రేటింగ్ అన్ని వేరియంట్లకు ఒకేలా వర్తిస్తుందని అనుకోవద్దు.. ముఖ్యంగా బ్రెజ్జా, సైరోస్ వంటి మోడళ్లలో రేటింగ్ వర్తించే వేరియంట్లను షోరూమ్‌లో నిర్ధారించుకోవాలి. కారు కొనేముందు ఎయిర్‌బ్యాగ్స్, ESC, సేఫ్టీ ఫీచర్లు, ధర, ఇన్సూరెన్స్ వంటి అంశాలను కూడా చెక్ చేయండి.. ఎందుకంటే కారు లుక్ బాగుంటే మాత్రమే కాదు.. మన ఫ్యామిలీ సేఫ్టీ కూడా చాలా ముఖ్యం..