Top 5 Affordable Bikes : కొంటే ఇలాంటి బైక్ కొనాలి.. తక్కువ ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైక్‌లు మిస్ అవ్వొద్దు!
Top 5 Affordable Bikes : మీరు 110cc సెగ్మెంట్‌లో మంచి మైలేజీ అందించే బైకు కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో బెస్ట్ బైక్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం బజాజ్, టీవీఎస్, హోండా నుంచి పాపులర్ బైకులు అందుబాటులో ఉన్నాయి. ఏది కొంటారో కొనేసుకోండి.
- Sreehari A
- Published on- May 19, 2026 / 03:56 PM IST
Top 5 Affordable Bikes ( Image credit : ChatGPT AI )
- 2026లో అత్యంత సరసమైన టాప్ 5 బైకులు ఇవే
- 110cc సెగ్మెంట్‌లో మీ బడ్జెట్ ధరలో ఏదైనా కొనేసుకోవచ్చు
- టీవీఎస్ స్పోర్ట్ నుంచి బజాజ్ ప్లాటినా ఏ బైకు ధర ఎంతంటే?
Top 5 Affordable Bikes : కొత్త బైకు కొనేందుకు చూస్తున్నారా? ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, మహిళా రైడర్‌ల కోసం ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సరసమైన బైకులు అందుబాటులో ఉన్నాయి.
అందులో 110cc బైక్‌ల సెగ్మెంట్ చౌకైన ధరలో లభిస్తున్నాయి. సౌకర్యవంతమైన ప్రయాణాలకు (Top 5 Affordable Bikes) ఈ బైకులు బెస్ట్ అని చెప్పొచ్చు. నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నెలవారీ బడ్జెట్‌పై భారం పడకుండా బెస్ట్ మైలేజీని అందించే బైకుల కోసం చూస్తున్నారు.
తక్కువ నిర్వహణ ఖర్చులు, ఈజీ మెయింట్ నెన్స్, సౌకర్యవంతమైన రైడ్ కారణంగా 110cc కమ్యూటర్ బైక్ సెగ్మెంట్ బాగా పాపులర్ అయింది. ఇందులో టీవీఎస్, హోండా, బజాజ్ వంటి బైకులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రోజువారీ సిటీ, సెమీ-అర్బన్ కస్టమర్ల కోసం అత్యంత సరసమైన 110cc బైక్‌ల కోసం చూస్తున్నవారికి అద్భుతమైన బైకులుగా చెప్పొచ్చు. ఇందులో మీకు ఏ బైకులో ఎంచుకుని కొనేసుకోవచ్చు.. ఓసారి పూర్తి జాబితాను పరిశీలిద్దాం..
టీవీఎస్ స్పోర్ట్ (రూ. 57,950) :
టీవీఎస్ స్పోర్ట్ బైక్ మీ బడ్జెట్ ధరలో 110cc బైకుల్లో ఒకటి. భారత మార్కెట్లో 109.7cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. సాధారణ రైడింగ్ పరిస్థితులలో లీటరుకు సుమారు 70కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ టీవీఎస్ బైక్ తేలికపాటి బాడీ (112 కేజీల కెర్బ్ బరువు), ఈజీ కమ్యూటర్-సెంట్రలైజడ్ స్టైలింగ్, రైడర్, పిలియన్ లాంగ్ సీటు ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.
టీవీఎస్ ఈ స్పోర్ట్ మోడల్‌లో ఎలక్ట్రిక్ స్టార్టర్ (సెల్ఫ్ స్టార్ట్), అల్లాయ్ వీల్స్, మేనేజ్‌మెంట్ ఖర్చులు తక్కువగా ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ ధర రూ. 57,950 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
టీవీఎస్ రాడియాన్ (రూ. 57,350) :
మీ బడ్జెట్ ధరలోనే రోజువారీ ప్రయాణాలకు కొంచెం ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి టీవీఎస్ రేడియాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ బైకు అదే 109.7cc ఇంజన్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. కానీ, మైలేజీ లీటరుకు సుమారు 68కి.మీగా అంచనా డిజైన్ పరంగా, క్రోమ్ యాక్సెంట్‌లతో రెట్రో-ప్రేరేపిత డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఈ బైక్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్, యూఎస్‌బీ ఛార్జింగ్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గ్రామీణ, ఫ్యామిలీ కస్టమర్లకు బాగా పాపులర్. టీవీఎస్ రేడియాన్ ధరను రూ. 57,350 (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (రూ. 72,500) :
స్టార్ సిటీ ప్లస్ అనేది టీవీఎస్ రేంజ్ నుంచి వచ్చిన మరో సరసమైన బైక్. రోజువారీ ప్రయాణాలకు స్పోర్టియర్‌గా తక్కువ ధరలో కారు కొనేవారికి అద్భుతమైన ఆప్షన్. ఈ బైక్‌లో 109.7cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. దాదాపు 67 కి.మీ/లీ మైలేజీని ఇస్తుంది. షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్, డ్యూయల్-టోన్ సీట్, స్పోర్టీ గ్రాఫిక్స్ పోటీదారుల కన్నా మరింత అడ్వాన్స్ ఉంటుంది.
తేలికైన క్లచ్ యాక్షన్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్‌తో రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. టీవీఎస్ ఈ బైక్‌ను సిటీ కోసం రూపొందించింది. టీవీఎస్, ETFi టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. స్టార్ సిటీ ప్లస్ ప్రారంభ ధర రూ. 72,500 (ఎక్స్-షోరూమ్)తో లభిస్తుంది.
హోండా లివో (రూ. 80,081) :
ప్రీమియం, స్పోర్టీ వైబ్‌తో హోండా లివో బడ్జెట్-కమ్యూటర్ సెగ్మెంట్‌లో అద్భుతమైన ఆప్షన్. ఇందులో 109.51cc ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. రియల్ టైమ్ లైఫ్ రైడింగ్ కోసం సుమారుగా 65 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. ఈ హోండా 110cc బైకులో ఆకర్షణీయమైన ట్యాంక్ ష్రౌడ్‌లు, గ్రాఫిక్స్, డిజైన్ ఉన్నాయి.
ట్రెడిషన్ బైక్‌ల నుంచి ప్రత్యేకంగా ఉంటుంది. హోండా నిర్మాణం, రైడ్ క్వాలిటీతో ఈ బైక్‌లో సైలెంట్ స్టార్టర్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ స్విచ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఈ బైక్ బేస్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 80,081 (ఎక్స్-షోరూమ్)తో వస్తుంది.
బజాజ్ ప్లాటినా 110 (రూ. 72,428) :
ఈ బజాజ్ ప్లాటినా 110 సౌకర్యం, ఇంధన సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్‌లో కొంచెం భారీ 115.45cc ఇంజన్ ఉంది. లీటరుకు సుమారు 70కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్. బజాజ్ ప్లాటినాను లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, క్విల్టెడ్ సీట్, నిటారుగా ఉండే ఎర్గోనామిక్స్‌తో అందిస్తుంది.
