Top 5 Rugged Smartwatches : వర్షాకాలంలో అడ్వెంచర్‌కు బెస్ట్.. రూ.3,500 లోపు టాప్ 5 రగ్గడ్ స్మార్ట్‌వాచ్‌లివే.. మీకు ఏది బెస్ట్?
Top 5 Rugged Smartwatches : రూ.3,500 లోపు బెస్ట్ రగ్గడ్ స్మార్ట్‌వాచ్‌ల కోసం చూస్తున్నారా? జీపీఎస్, అమోల్డ్, వాటర్ రెసిస్టెన్స్, స్పోర్ట్స్ మోడ్లతో టాప్ 5 వాచ్‌ల వివరాలివే..
Top 5 Rugged Smartwatches
- అవుట్డోర్ యాక్టివిటీల కోసం కొత్త రగ్గడ్ స్మార్ట్‌వాచ్‌లు
- రూ. 3,500 లోపు ధరలో బెస్ట్ రెయిన్ సీజన్ వాచ్‌లు
- వర్షాకాలంలో ఏ టైప్ స్మార్ట్‌వాచ్‌లను తీసుకోవచ్చంటే?
Top 5 Rugged Smartwatches : అసలే వర్షాకాలం.. ఈ రెయిన్ సీజన్లో చాలామంది ట్రెక్కింగ్, సైక్లింగ్, రన్నింగ్, కొత్త ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. అయితే వర్షం, బురద, తేమ, జారికిందపడటం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ స్మార్ట్‌వాచ్ వెంటనే దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అందుకే, అవుట్డోర్ యాక్టివిటీల కోసం రగ్గడ్ స్మార్ట్‌వాచ్‌లు బెస్ట్ ఆప్షన్లుగా చెప్పవచ్చు. జీపీఎస్, హార్ట్‌రేట్ మానిటరింగ్, స్పోర్ట్స్ మోడ్లు, స్లీప్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ (Top 5 Rugged Smartwatches) వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.3,500 లోపు ధరలో టాప్ 5 రగ్గడ్ స్మార్ట్వాచ్లేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..
1. టైమెక్స్ టఫ్ 1.43” అమోల్డ్ రగ్గడ్ స్మార్ట్‌వాచ్
ధర : రూ.3,495, రేటింగ్ : 3.7/5
466×466 పిక్సెల్స్ అమోల్డ్ డిస్ప్లే, ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లతో వచ్చే ఈ వాచ్ ఆండ్రాయిడ్, iOS రెండింటికీ కనెక్ట్ అవుతుంది.
హైలైట్స్ : 7+ రోజుల బ్యాటరీ, 100 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లు.
ఎందుకు కొనాలి :
ఎక్కువసేపు అవుట్‌డోర్‌లో ఉండేవారికి లాంగ్ బ్యాటరీ, మన్నిక అనేది మెయిన్ ఆకర్షణ.
2. నాయిస్ఫిట్ ఎండీవర్ ప్రో :
ధర : రూ.3,499, రేటింగ్: 4.0/5
1.46-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, SOS, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ వాచ్ ఫిట్నెస్ ప్రియులకు అద్భుతంగా ఉంటుంది.
Read Also : Minister Anitha : అమరావతి ఛాంపియన్‌షిప్‌లో అపశ్రుతి.. హోంమంత్రి అనిత చేతికి స్వల్పగాయం.. ఏమైందంటే?
ఎందుకు కొనాలి :
రోజువారీ వాడకంతో పాటు రెయిన్ సీజన్ స్పోర్ట్స్, అవుట్డోర్ యాక్టివిటీలకు సరిపోయే ఫీచర్లు ఉన్నాయి.
3. ఫైర్-బోల్ట్ అసాల్ట్ :
ధర : రూ.1,460, రేటింగ్ : 2.8/5
తక్కువ బడ్జెట్లో రగ్గడ్ డిజైన్, 1.45-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్, పెడోమీటర్, క్యాలరీ, హార్ట్‌రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందిస్తుంది.
ఎందుకు కొనాలి :
తక్కువ ధరలో రగ్గడ్ లుక్, స్టాండర్డ్ ఫిట్నెస్ ఫీచర్లు కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.

Top 5 Rugged Smartwatches
4. క్రాస్‌బీట్స్ ఎవరెస్ట్ 2.0 :
ధర: రూ.3,499,రేటింగ్: 3.8/5
ఇంటర్నల్ జీపీఎస్, 100+ స్పోర్ట్స్ మోడ్లు, బ్లూటూత్ కాలింగ్, 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
ఎందుకు కొనాలి :
ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి యాక్టివిటీలకు జీపీఎస్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
5. ఫాస్ట్‌ట్రాక్ ఎక్స్ట్రీమ్ ప్రో :
ధర : రూ.3,299, రేటింగ్ : 4.3/5
1.43-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, జీపీఎస్, 100+ స్పోర్ట్స్ మోడ్లు, హార్ట్‌రేట్, SpO2, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఎందుకు కొనాలంటే? :
స్టైలిష్ లుక్‌తో పాటు ఫిట్నెస్, GPS, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కావాలనుకునేవారికి మంచి బడ్జెట్ ఆప్షన్.
వర్షాకాలంలో ఏది బెస్ట్? :
తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తుంటే ఫైర్-బోల్ట్ తీసుకోవచ్చు. అసాల్ట్ జీపీఎస్ బ్యాటరీ కెపాసిటీతో క్రాస్‌బీట్స్ ఎవరెస్ట్ 2.0 హెల్త్ ట్రాకింగ్ కోసం ఫాస్ట్‌ట్రాక్ ఎక్స్ట్రీమ్ ప్రోను తీసుకోవచ్చు. అయితే, ఏదైనా కొత్త స్మార్ట్ వాచ్ కొనే ముందు లేటెస్ట్ ధర, వాటర్-రెసిస్టెన్స్ రేటింగ్, ఫీచర్లను తప్పనిసరిగా చెక్ చేయండి.
