Minister Anitha : అమరావతి ఛాంపియన్‌షిప్‌లో అపశ్రుతి.. హోంమంత్రి అనిత చేతికి స్వల్పగాయం.. ఏమైందంటే?
Minister Anitha : అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభ వేడుకల్లో డ్రోన్ బ్యాటరీ తగలడంతో హోంమంత్రి వంగలపూడి అనిత చేతికి స్వల్ప గాయమైంది. చికిత్స అనంతరం ఆమె కార్యక్రమాన్ని కొనసాగించారు.
Home Minister Anita Injured Slightly
- వేదికపై డ్రోన్ కలకలం.. హోంమంత్రి అనితకు స్వల్ప గాయం
- విజయవాడలో అమరావతి ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు
- కార్యక్రమాన్ని నిలిపివేయకుండా కొనసాగించిన మంత్రి అనిత
Minister Anitha : అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చేతికి స్వల్ప గాయమైంది. ప్రమాదవశాత్తు డ్రోన్ బ్యాటరీ తగలడంతో ఆమె చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం ఆమె చేతికి బ్యాండేజ్ వేశారు. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో డ్రోన్ కిందకు వచ్చింది. ఈ సమయంలోనే ఆ డ్రోన్ మంత్రి అనిత చేతికి తగిలినట్టు సమాచారం. అయితే, ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంబంధిత డ్రోన్‌ను సీజ్ చేశారు.
భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ వినియోగంపై అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. చేతికి స్వల్ప గాయం కావడంతో మంత్రి అనిత కార్యక్రమాన్ని ఆపలేదు. చేతికి బ్యాండేజ్‌తోనే వేదికపై ప్రసంగించి కార్యక్రమాన్ని కొనసాగించారు.
Read Also : N Ramachandra Rao: బీజేపీ ఫీజు రీయింబర్స్మెంట్ లడాయి.. రేవంత్ ప్రభుత్వంపై రాంచందర్ షాకింగ్ కామెంట్స్
మరోవైపు.. అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కాగా 4 రోజుల పాటు జరగనున్నాయి. హోంమంత్రి అనితతో పాటు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ సహా 9 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ముగింపు వేడుకలు కూడా నిర్వహించనున్నారు.
