TVS Bikes to Buy in 2026 : కొత్త బైకు కొనేవారికి పండగే.. మీ బడ్జెట్ ధరలో టాప్ 5 TVS బైకులివే.. ఏది కొంటారో మీ ఇష్టం..!
TVS Bikes to Buy in 2026 : కొత్త టీవీఎస్ బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. సరసమైన ధరలో అద్భుతమైన పర్ఫార్మెన్స్, మంచి మైలేజీ అందించే బైకుల కోసం చూస్తున్నారా? ఈ టాప్ 5 బైకులపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- June 13, 2026 / 06:57 PM IST
TVS Bikes to Buy in 2026
TVS Bikes to Buy in 2026 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? దేశీయ మార్కెట్లో మీ బడ్జెట్ ధరలో అద్భుతమైన బైకులు లభ్యమవుతున్నాయి. సరసమైన ధరలో మంచి బైక్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. సరికొత్త టెక్నాలజీతో పాటు అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తాయి.
ప్రస్తుతం ఈ టీవీఎస్ కంపెనీ సిటీ కమ్యూటర్ బైక్‌ల నుంచి స్పోర్టీ అడ్వెంచర్-స్టయిల్ బైక్‌ల వరకు వైడ్ రేంజ్ ఆప్షన్లను (TVS Bikes to Buy in 2026) అందిస్తోంది. 2026 ఏడాదిలో మీ బడ్జెట్ ధరలో 5 బెస్ట్ సరసమైన ధరలో లభించే టీవీఎస్ బైక్‌లేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
టీవీఎస్ రైడర్ 125 (ఎక్స్-షోరూమ్ ధర : రూ. 82,860 ) :
ఈ ప్రీమియం కమ్యూటర్ టీవీఎస్ బైక్ అదిరిపోయే ‘స్ట్రీట్‌ఫైటర్’ స్టైలింగ్ హై-టెక్ కలర్ టీఎప్టీ డిస్‌ప్లేతో వస్తుంది. 12.23hp పవర్‌ఫుల్ పవర్, అద్భుతమైన ఫ్యూయల్ ఎకానమీని అందిస్తుంది. తద్వారా అదనపు ఖర్చు లేకుండానే మీకు పెద్ద బైక్ నడుపుతున్న ఫీలింగ్ ఉంటుంది.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4V (ఎక్స్-షోరూమ్ ధర : రూ. 1.19 లక్షలు) :
ఈ కమ్యూటర్ బైక్ అచ్చం రేసర్ బైకు మాదిరిగానే ఉంటుంది. దాదాపు ఇందులో అదే ఇంజినీరింగ్ ఉంటుంది. చూసేందుకు మరింత స్పోర్టీగా ఉంటుంది. ఈ బైక్‌లో మల్టీ రైడింగ్ మోడ్‌లు, అత్యుత్తమమైన పవర్ అడ్జెస్టబుల్ లివర్‌లు ఉన్నాయి. రోజువారీ ప్రయాణాలకు సరసమైన స్పోర్ట్స్ బైక్.
Read Also : PhonePe Fraud : మీ ఫోన్‌పేలో ఇలా క్యాష్ రిక్వెస్ట్ వచ్చిందా? క్లిక్ చేశారంటే ఖతమే..! ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
టీవీఎస్ రోనిన్ (ఎక్స్-షోరూమ్ ధర : రూ. 1.29 లక్షలు) :
టీవీఎస్ రోనిన్ బైక్ కూడా సిటీ, హైవేలు రెండింటిలోనూ సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. మల్టీఫేస్ నియో-రెట్రో స్క్రాంబ్లర్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ప్రీమియం అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, పవర్‌ఫుల్ 225cc ఇంజన్, సౌకర్యవంతంగా ఎర్గోనామిక్స్‌తో లభించే సరసమైన లైఫ్‌స్టైల్ టూరర్ బైక్ అని చెప్పొచ్చు.
టీవీఎస్ రాడియాన్ (ఎక్స్-షోరూమ్ ధర : రూ. 58,450) :
ఆఫీసుకు వెళ్లేవారికి ఈ 110cc కమ్యూటర్ బైక్ బాగుంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా లేదా కఠినమైన రోడ్లు వంటి భూభాగాల్లో కూడా వేగంగా దూసుకెళ్లగలదు. తక్కువ బడ్జెట్ రైడర్ల కోసం తక్కువ నిర్వహణ ఖర్చులు, అద్భుతమైన మైలేజీని అందిస్తుంది.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4V (ఎక్స్-షోరూమ్ ధర : రూ. 1.37 లక్షలు)
ఈ టీవీఎస్ బైక్ ఇతర బైకుల కన్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ బైక్ సరసమైన ధరలో మంచి రేసింగ్ హార్డ్‌వేర్ అందిస్తుంది. ఇందులో అడ్జెస్టబుల్ సస్పెన్షన్, అడ్వాన్స్ రైడింగ్ మోడ్స్, కచ్చితమైన హ్యాండ్లింగ్ ఉన్నాయి. తక్కువ ధరకే ట్రాక్-లెవల్ పర్ఫార్మెన్స్ స్పోర్టీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే రైడర్‌లకు ఈ బైక్ చాలా బెస్ట్.
