Top 6 Upcoming Cars : కొత్త కారు కొంటున్నారా? ఈ నెలాఖరులో రాబోయే టాప్ 6 కార్లు ఇవే.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు!
Top 6 Upcoming Cars : కొత్త కారు కొంటున్నారా? 2026 మే నెలాఖరులో రాబోయే టాప్ 6 కార్లు ఇలా ఉన్నాయి. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published on- May 18, 2026 / 02:41 PM IST
Top 6 Upcoming Cars
- కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఫీచర్లు, ధర వివరాలివే
- మే నెలాఖరులో రానున్న టాటా నుంచి హోండా సిటీ మోడళ్లు
- సేఫ్టీ, మైలేజ్, డిజిటల్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ ప్రత్యేక ఆకర్షణ
Top 6 Upcoming Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2026 మే నెలాఖరులో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త కారు మోడల్స్ రాబోతున్నాయి. ఇందులో ఈవీలు, ఎస్‌యూవీలు, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు అడ్వాన్స్ టెక్నాలజీతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ప్రత్యేకించి సేఫ్టీ, మైలేజ్, డిజిటల్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ వంటి ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉండనున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
1. టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ :
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు ధర సుమారు రూ. 8 లక్షల మధ్య (Top 6 Upcoming Cars) ఉండవచ్చు. కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ బంపర్‌తో స్టైలిష్ లుక్ అందిస్తుంది. 24kWh బ్యాటరీ ప్యాక్‌తో 300కి.మీ వరకు రేంజ్ అందించనుంది. భారీ టచ్‌స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డిజిటల్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఆప్షన్లు ఉండొచ్చు.
2. మారుతి సుజుకి బ్రెజ్జా 2026 :
ఈ మారుతి ఎస్‌యూవీ కారు ధర రూ. 8.5 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. కొత్త గ్రిల్, హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్‌తో వస్తుంది. 360° కెమెరా, భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్‌ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్స్, అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉండొచ్చు.
Read Also : Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ. 12వేలు ఆదా.. ఇప్పుడు కొనాలా? వద్దా?
3. నిస్సాన్ గ్రావైట్ :
బడ్జెట్ ఎస్‌యూవీ రానున్న ఈ నిస్సాన్ కారు ధర రూ. 5.65 నుంచి రూ. 9.18 లక్షల మధ్య ఉండొచ్చు. 1.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎల్ఈడీ లైటింగ్ స్పెషాలిటీగా రానుంది. ఫ్యామిలీ ప్రయాణాలకు సరిపడే బూట్ స్పేస్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది.
4. టయోటో అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా :
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 18 లక్షల నుంచి రూ. 21 లక్షల వరకు ఉండవచ్చు. రెండు బ్యాటరీ ఆప్షన్లతో 500కి.మీ పైగా రేంజ్ ఇవ్వొచ్చని సమాచారం. భారీ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, ఫాస్ట్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఆప్షన్లు ఉండనున్నాయి.
5. ఎంజీ మెజిస్టర్ :
ఈ ప్రీమియం ఎస్‌యూవీ ధర రూ. 40 లక్షల వరకు ఉండొచ్చు. 2.0ఎల్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4WD సిస్టమ్ ఉండనున్నాయి. డ్యూయల్ స్క్రీన్స్, మసాజ్ సీట్లు, అడాస్ సేఫ్టీ, టెర్రైన్ మోడ్స్, లగ్జరీ ఇంటీరియర్ ఉండొచ్చు.
6. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ :
ఈ హోండా సెడాన్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 12.5 లక్షల నుంచి ఉండవచ్చు. కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హనీకాంబ్ గ్రిల్, అలాయ్ వీల్స్‌తో రిఫ్రెష్ డిజైన్ ఉండనుంది. 1.5లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు అలాగే కొనసాగుతాయి. 360° కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ క్లస్టర్, హోండా సెన్సింగ్ అడాస్, వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి.
