Toshiba Mini LED TV : 144Hz డిస్ప్లేతో తోషిబా మినీ LED టీవీ వచ్చేసింది.. పవర్ఫుల్ స్పీకర్లు, ఫాస్ట్ డిస్ప్లే అదుర్స్.. ధర ఎంతంటే?
Toshiba Mini LED TV : కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? తోషిబా Z670SP మినీ LED టీవీ సిరీస్ వచ్చేసింది. 144Hz డిస్ప్లే, ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయంటే?
Toshiba Mini LED TV
- తోషిబా మినీ ఎల్ఈడీ టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్
- డాల్బీ అట్మోస్‌తో ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్ సిస్టమ్
- 55 అంగుళాల నుంచి 100 అంగుళాల వరకు సైజుల్లో
Toshiba Mini LED TV : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? తోషిబా Z670SP మినీ LED టీవీ సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మినీ ఎల్ఈడీ స్క్రీన్ 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్, 4K రిజల్యూషన్, ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్ అందిస్తుంది. ధర రూ. 65వేల లోపు ధరకే లభిస్తోంది.
మీరు కొత్త మిడ్-ప్రీమియం టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. ఈ టీవీ మినీ LED ప్యానెల్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, 144Hz ప్యానెల్ కారణంగా స్మూత్ విజువల్స్ ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్ల నుంచి డైరెక్ట్ ఆడియోను అందిస్తుంది. ఈ తోషిబా పూర్తి ధర, ఇతర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
ధర, లభ్యత :
తోషిబా Z670SP సిరీస్ ధర రూ. 64,990 నుంచి ప్రారంభమవుతుంది. లాంచ్ సమయంలో రూ. 10వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీకి 2 ఏళ్ల ఫుల్ వారంటీ లభిస్తుంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
తోషిబా మినీ ఎల్ఈడీ టీవీ 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాలు, 100-అంగుళాల సైజులలో లభిస్తుంది. ఈ టీవీలో బ్యాక్‌లైట్ టెక్నాలజీతో చిన్న ఎల్ఈడీల నుంచి మెరుగైన కాంట్రాస్ట్ కంట్రోలింగ్ పొందవచ్చు.
సాధారణ ఎల్ఈడీ టీవీలతో పోలిస్తే.. మినీ ఎల్ఈడీలు బ్లాక్ కలర్ లోనూ అద్భుతమైన బ్రైట్ నెస్ అందిస్తాయి. ముఖ్యంగా HDR కంటెంట్ ప్రయోజనకరంగా ఉంటంది. HDR విషయానికి వస్తే మెరుగైన విజువల్స్ కోసం ఈ టీవీ డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది.
తోషిబా అప్‌స్కేలింగ్, పిక్చర్ ప్రాసెసింగ్ కోసం REGZA ఇంజిన్ ZRiని ఉపయోగించింది. డీటీహెచ్ లేదా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వచ్చే లో-రిజల్యూషన్ కంటెంట్‌ను 4K ప్యానెల్‌పై మరింత క్లియర్ కనిపించేలా చేయొచ్చు.
ఈ ప్యానెల్ నేటివ్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. మీరు సీరియస్ గేమర్ అయితే.. షాస్ట్ స్పోర్ట్స్, గేమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. గేమింగ్ ఫీచర్లలో గేమ్ మోడ్ ప్రో కూడా ఉంది. ఇన్పుట్ లాగ్‌ను తగ్గించి ఫాస్ట్ రెస్సాన్స్ అందిస్తుంది.
ఆడియో పరంగా తోషిబా సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లు బాగున్నాయి. ఆబ్జెక్ట్-బేస్డ్ వర్చువల్ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం డాల్బీ అట్మోస్‌కు సపోర్టు ఉంది. సాధారణ టీవీ వ్యూ కోసం చాటింగ్ బాస్ బ్యాలెన్స్ చేసేందుకు కంపెనీ REGZA పవర్ ఆడియో+, ఐలెక్స్ ప్రిజం ట్యూనింగ్ కూడా పొందుతుంది.ఈ టీవీ, తోషిబా పేరెంట్ కంపెనీ హైసెన్స్ వారి విడా ఓఎస్ (Vidaa OS)పై రన్ అవుతుంది.
