Toyota Hyryder Aero Black : కొంటే ఇలాంటి కారు కొనాలి.. టయోటా కొత్త బ్లాక్ SUV అదుర్స్, 27.97కి.మీ మైలేజ్.. ధర తెలిస్తే షాక్!
Toyota Hyryder Aero Black : టయోటా పాపులర్ SUV హైరైడర్ కొత్త ఎడిషన్ లాంచ్ అయింది. ఈ ఎడిషన్ నియోడ్రైవ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో పాటు 27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఏరో బ్లాక్ ఎడిషన్ ప్రత్యేక ఫీచర్లను పరిశీలిద్దాం..
- Sreehari A
- Published on- August 12, 2026 / 04:11 PM IST
Toyota Hyryder Aero Black
- టయోటా కొత్త బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది..
- SUV కొనాలనుకునేవాళ్లకు ఇదే జాక్‌పాట్
- టయోటా బ్లాక్ ఎడిషన్ కారు ధర ఎంతంటే?
- సెల్ఫ్-ఛార్జింగ్ టెక్నాలజీ స్పెషల్ అట్రాక్షన్
Toyota Hyryder Aero Black : టయోటా మిడ్‌సైజ్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో సరికొత్త వేరియంట్ వచ్చేసింది. ఈ కంపెనీ ఏరో బ్లాక్ ఎడిషన్ అనే లిమిటెడ్-ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ స్టైలింగ్ ప్యాకేజీ మిడ్‌నైట్ బ్లాక్ G, V వేరియంట్లతో వస్తుంది.
ఏరో బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీ నియో డ్రైవ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది. ఈ ప్యాకేజీకి అదనపు రుసుము (Toyota Hyryder Aero Black) కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఏరో బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీ ధర రూ. 31,999కు లభిస్తుంది. ఈ ప్యాకేజీలో అనేక ఎక్స్‌ట్రనల్ ఫీచర్లు ఉంటాయి.
ఈ ప్యాకేజీలో స్పెషాలిటీ ఏంటి? :
హైరైడర్ కోసం ఈ ప్యాకేజీలో ఫ్రంట్ గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫ్రంట్ స్పాయిలర్, హెడ్‌ల్యాంప్‌లపై బ్లాక్ గార్నిష్, టెయిల్‌గేట్ గార్నిష్ రియర్ స్పాయిలర్‌తో సహా బ్లాక్-థీమ్ ఎక్స్‌ట్రనల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీకి ప్రత్యేకమైన ఏరో బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా లభిస్తుంది.
Read Also : PM E-Drive Scheme : బయ్యర్లకు బ్యాడ్ న్యూస్! ఈ-స్కూటర్ల సబ్సిడీ సగానికి కోత.. స్కీమ్ 2028 వరకు పొడిగింపు!
ఈ స్టైలింగ్ ప్యాకేజీ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ స్టాక్ అయిపోతే తిరిగి పొందలేరు. అందుకు బదులుగా టయోటా డీలర్-లెవల్ ఆల్ బ్లాక్ ప్యాకేజీని కొనేసుకోవచ్చు. ఈ కారు ధరలు రూ. 11.31 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. కాగా, హైబ్రిడ్ వెర్షన్ ధర రూ. 17.18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఇంజిన్, మైలేజ్ ఫీచర్లు :
ఈ కారు సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ నియోడ్రైవ్ అనే 2 పవర్‌ట్రెయిన్‌లలో వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. నియోడ్రైవ్ 1.5-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. మాన్యువల్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో లభిస్తుంది.
హైరైడర్‌లో ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్, క్రిస్టల్ గ్రిల్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 2022లో లాంచ్ దగ్గర నుంచి ఈ కారు 2లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది.
