TRAI New Rules: ప్రీపెయిడ్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక 30 రోజుల వ్యాలిడిటీతో.. డేటా లేకుండా ఓన్లీ కాల్స్.. ట్రాయ్ కొత్త రూల్స్!
దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా టెలికాం నియంత్రణ సంస్థ(TRAI New Rules) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- September 28, 2026 / 08:56 AM IST
TRAI introduced new regulations regarding 30-day validity recharge plans.
TRAI New Rules: దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా టెలికాం నియంత్రణ సంస్థ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టెలికాం కంపెనీలు(TRAI New Rules) అమలు చేస్తున్న 28 రోజుల రీఛార్జ్ వ్యాలిడిటీ సైకిల్‌కు స్వస్తి పలుకుతూ, ఇకపై పూర్తి 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026 పేరుతో సవరించిన ఈ కొత్త మార్గదర్శకాలను ట్రాయ్ అధికారికంగా విడుదల చేసింది. దీనివల్ల సాధారణ ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరనుంది.
ఏడాదికి 12 రీఛార్జ్‌లే – రాఘవ్ చడ్డా చొరవకు లభించిన విజయం:
ఇప్పటివరకు 28 రోజుల ప్లాన్ల వల్ల వినియోగదారులు 12 నెలల వ్యవధి ఉన్న ఒక ఏడాదిలో మొత్తం 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వచ్చేది. అంటే ఏటా ఒక అదనపు నెల రీఛార్జ్ భారం పడేది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా పార్లమెంట్‌లో లేవనెత్తుతూ, వినియోగదారులకు కచ్చితంగా 30 రోజుల నెలవారీ ప్లాన్లు ఇచ్చేలా చూడాలని కోరారు. ట్రాయ్ తెచ్చిన ఈ కొత్త సవరణతో ఇకపై ఏడాదికి 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది, వినియోగదారుల అదనపు భారం తగ్గుతుంది.
డేటా లేకుండా కేవలం కాల్స్, SMS ప్లాన్లు – ట్రాయ్ నూతన మార్గదర్శకాలు:
స్మార్ట్‌ఫోన్లు లేదా ఇంటర్నెట్ వాడని సాధారణ వినియోగదారుల కోసం ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ (SMS) సేవలు మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేకమైన, చౌకైన ప్లాన్లను తప్పనిసరిగా అందించాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల డేటా అవసరం లేని వృద్ధులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు రీఛార్జ్ వ్యయం మరింత తగ్గనుంది. టెలికాం సంస్థలు ఈ నూతన రీఛార్జ్ ఆప్షన్లను త్వరలోనే అమల్లోకి తేనున్నాయి.
