TRAI New Rules : TRAI కొత్త రూల్స్.. 1601 నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయాలా? ఇదిగో ఫుల్ క్లారిటీ!

TRAI New Rules : ట్రాయ్ యుటిలిటీస్ లాజిస్టిక్స్ వంటి ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ట్రాయ్ కొత్త నంబర్ సిరీస్‌ను ప్రకటించింది. ముందుగా ఈ కొత్త సిరీస్‌ను కొరియర్, లాజిస్టిక్స్ యుటిలిటీస్ కోసం అందుబాటులోకి తెచ్చింది.

TRAI New Rules

  • యుటిలిటీ సర్వీస్ కాల్స్ కోసం ట్రాయ్ కొత్త 1601 సిరీస్‌
  • ఈ కొత్త సిరీస్‌ను 90 రోజుల్లోగా అమలుకు గడువు విధింపు
  • నకిలీ నంబర్ల నుంచి ఫేక్ కాల్స్‌ నియంత్రణకు ట్రాయ్ నిర్ణయం

TRAI New Rules : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యుటిలిటీస్ లాజిస్టిక్స్ వంటి ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ట్రాయ్ కొత్త నంబర్ సిరీస్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ 1601తో మొదలవుతుంది.

గతంలో, బ్యాంకింగ్ ఆర్థిక సేవల కోసం ట్రాయ్ 1600 నంబర్ సిరీస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మోసపూరిత, ఫేక్ కాల్స్ నుంచి ప్రజలను ప్రొటెక్ట్ చేసేందుకు ఈ కొత్త నంబర్ సిరీస్‌ను జారీ చేసింది. ముఖ్యంగా యుటిలిటీ సర్వీసులు, కొరియర్ సర్వీసులు, ఫుడ్ డెలివరీ సర్వీసుల కోసం కంపెనీలు ఇకపై ఈ కొత్త నంబర్ సిరీస్‌ను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నిబంధనలలో 1601 నంబర్ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మొదటి దశలో యుటిలిటీస్, కొరియర్ లాజిస్టిక్స్ రంగాలకు ఈ నెంబర్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సిరీస్‌ను మధ్యవర్తులు, అగ్రిగేటర్లకు కాకుండా ప్రత్యేకంగా నేరుగా డిజిటల్ సంస్థలకు మాత్రమే కేటాయిస్తారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఈ నంబర్లను జారీ చేసే ముందు ఈ డిజిటల్ సంస్థలను వెరిఫై చేయాల్సి ఉంటుంది.

ఈ కొత్త రూల్ ఎందుకంటే? :

కొరియర్ ఫుడ్ డెలివరీ వంటి మోసపూరిత ఆన్‌లైన్ సర్వీసులను నిరోధించి వినియోగదారులు ఈజీగా గుర్తించేందుకు వీలుగా టెలికాం నియంత్రణ సంస్థ ఈ కొత్త నంబర్ సిరీస్‌ను ప్రకటించింది. ప్రారంభంలో యుటిలిటీస్, లాజిస్టిక్స్ కొరియర్ సర్వీసులు ఉంటాయని ట్రాయ్ ఉత్తర్వులో పేర్కొంది.

Read Also : Redmi Note 17 Sale : ఖతర్నాక్ ఫోన్ భయ్యా.. కొత్త రెడ్‌మి నోట్ 17పై స్పెషల్ డిస్కౌంట్.. ధర జస్ట్ ఎంతంటే?

యుటిలిటీలలో విద్యుత్ పంపిణీ సంస్థలు, నీటి సరఫరా సంస్థలు, నగర గ్యాస్ పంపిణీ సంస్థలు, ఎల్‌పీజీ పంపిణీ సంస్థలు ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఉంటారు. లాజిస్టిక్స్ కొరియర్ సర్వీసుల్లో కొరియర్ కంపెనీలు, ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీలు, పార్శిల్ డెలివరీ సర్వీసులు, సరుకు రవాణా లాజిస్టిక్స్ ఉంటాయి.

ట్రాయ్ నిబంధనలివే :
మొదటి దశలో 90 రోజుల్లోగా ఈ సంస్థల వెరిఫికేషన్ పూర్తి చేయాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. ఆ తర్వాత ఆయా కంపెనీలకు సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త 1601 సిరీస్ నంబర్లను కేటాయించాలి. ఈ నంబర్ల నుంచి చేసే కాల్స్‌లో ఎలాంటి క్యాంపెయిన్ యాక్టివిటీ ఉండకూడదని కూడా ట్రాయ్ ఆదేశించింది. వాటిని కేవలం సర్వీస్ నంబర్‌గా మాత్రమే వినియోగించాలి.

టీసీసీసీపీఆర్‌లో మార్పులకు రెడీ :
ఇటీవలే, ట్రూకాలర్ వంటి కాల్ మేనేజ్‌మెంట్ యాప్‌ల డేటా షేరింగ్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ కఠినతరం చేసింది. ప్రస్తుత టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (TCCCPR)లో మార్పులకు ట్రాయ్ (TRAI) రెడీ అవుతోంది.

అంతేకాదు.. 1600 140తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ట్రూకాలర్ ఇతర కాల్ మేనేజ్‌మెంట్ యాప్‌లు స్పామ్‌గా ప్రకటించడంపై ఆయా కంపెనీల నుంచి టెలికాం నియంత్రణ సంస్థ వివరణ కోరింది.

అలాగే, 1600తో ప్రారంభమయ్యే కాల్స్‌ను కేవలం బ్యాంకింగ్ ఆర్థిక సేవల కోసం మాత్రమే వాడుతారని స్పష్టం చేసింది. కాగా, 140 సిరీస్‌లోని నంబర్లను క్యాంపెయిన్ యాక్టివిటీస్ కోసం వినియోగించవచ్చునని తెలిపింది.