×
Ad

UPI Credit Points : పండగ చేస్కోండి.. మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉందా? ఇలా యూపీఐ పేమెంట్లు చేస్తే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్!

UPI Credit Points : రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ లింక్ చేస్తే రోజువారీ పేమెంట్లపై రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ సంపాదించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

UPI Credit Points

  • యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా పేమెంట్లు చేస్తున్నారా?
  • రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేస్తే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్
  • మర్చంట్ పేమెంట్లపై మాత్రమే రివార్డ్ పాయింట్లు పొందవచ్చు

UPI Credit Points : యూపీఐ యూజర్లకు బంపర్ ఆఫర్.. యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లు చేసేవారికి అద్భుతమైన అవకాశం.. కిరాణా షాపుల నుంచి క్యాబ్ ఛార్జీల వరకు ప్రతిచోటా యూపీఐ పేమెంట్ల కోసం QR కోడ్‌లను స్కాన్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు మీ రూపే క్రెడిట్ కార్డ్‌ యూపీఐ లింక్ చేసి పేమెంట్లు చేస్తే రివార్డు పాయింట్లు కూడా పొందవచ్చు. ప్రతి రోజువారీ యూపీఐ పేమెంట్లపై రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు.

ఈ కొత్త విధానం కస్టమర్లకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో, యూపీఐ పేమెంట్లు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా జరిగేవి. తద్వారా అదనపు బెనిఫిట్స్ పొందలేరు. ఇప్పుడు, మీరు QR కోడ్‌ను స్కాన్ ద్వారా పేమెంట్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.

అలాగే పొందిన రివార్డ్ పాయింట్లు మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. మీరు కూరగాయలు, పాలు, పెట్రోల్ లేదా మెడిషన్ వంటి రోజువారీ కొనుగోళ్లపై కూడా ఇప్పుడు రివార్డులు పొందవచ్చు.

ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే? :
ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులను మాత్రమే యూపీఐ యాప్‌లకు లింక్ చేయవచ్చు.
– మీరు షాపులో QR కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా మీ క్రెడిట్ కార్డు నుంచి కట్ అవుతుంది.
– మీరు క్రెడిట్ కార్డు స్వైప్ ద్వారా పొందే ప్రతి లావాదేవీపై అదే రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.

Read Also : Google Pixel 10 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ధర ఎంతంటే?

అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయి. రివార్డ్ పాయింట్లు మర్చంట్ పేమెంట్లపై మాత్రమే వస్తాయి. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్లకు పీర్-టు-పీర్ ట్రాన్స్ ఫర్లపై వర్తించవు. ఇంకా, క్రెడిట్ కార్డ్ లిమిట్స్, ఛార్జీలు సాధారణ కార్డ్ వాడకం మాదిరిగానే వర్తిస్తాయి. ప్రతి బ్యాంకు, కార్డ్ కంపెనీకి సొంత రూల్స్ ఉన్నాయి. రివార్డ్ స్కీమ్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మారవచ్చు.

కస్టమర్లకు మాత్రమే కాకుండా బ్యాంకులు, కార్డు కంపెనీలకు కూడా బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. కార్డు వినియోగం పెరుగుతాయి. ఇంకా, కస్టమర్లు రోజువారీ చెల్లింపులపై కూడా రివార్డు పాయింట్లను పొందవచ్చు. ఇందులో షాపింగ్, ట్రావెల్ లేదా ఇతర ఆఫర్‌ల కోసం రీడీమ్ చేసుకోవచ్చు.

యూపీఐ, క్రెడిట్ కార్డులతో ఇకపై రివార్డు పాయింట్లు పొందవచ్చు. ప్రతి QR స్కాన్ పేమెంట్, గిఫ్ట్స్ రెండింటిని పొందవచ్చు. కస్టమర్‌లు యూపీఐ పేమెంట్ చేసే ముందు తమ కార్డు లిమిట్స్, రూల్స్ తప్పక గుర్తుంచుకోవాలి.