UCO Bank FD Returns : ఈ బ్యాంకు కస్టమర్లకు పండగే.. 444 రోజుల FDలపై అత్యధిక వడ్డీ రేట్లు.. రాబడి ఎంతంటే?

UCO Bank FD Returns : రెగ్యులర్ కస్టమర్లతో పోలిస్తే.. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఒక ఏడాది కన్నా ఎక్కువ టెన్యూర్ ఉన్న FD ఖాతాలపై యూకో బ్యాంక్ 0.50శాతం అధిక వడ్డీ రేటును అందిస్తోంది.

UCO Bank FD Returns

  • యూకో బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్
  • 444 రోజుల FDపై వడ్డీ ఎంతంటే?
  • 6.45శాతం నుంచి 6.95శాతం వరకు వడ్డీ రేట్లు

UCO Bank FD Returns : యూకో బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. యూకో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలపై 2.90శాతం నుంచి 8.1శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు తమ ఉద్యోగులకు, రిటైర్డ్ సీనియర్ సిటిజన్ సిబ్బందికి FD ఖాతాలపై అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది. యూకో బ్యాంక్‌లో 444 రోజుల FD పథకంపై ఎంత వడ్డీని అందిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

444 రోజుల FDపై వడ్డీ ఎంతంటే? :
యూకో బ్యాంక్ తమ కస్టమర్ల కోసం స్పెషల్ 444-రోజుల FD పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద 6.45శాతం నుంచి 6.95శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు ఉన్న కస్టమర్లందరికీ 444-రోజుల FD ఖాతాలపై యూకో బ్యాంక్ 6.45శాతం వడ్డీని అందిస్తోంది.

60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు 444-రోజుల FDలపై 6.95శాతం వడ్డీని అందిస్తున్నారు. ఇక్కడ పేర్కొన్న వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న FD ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి.

Read Also : Vivo Y31t Launch : వివో నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాలు!

ప్రభుత్వ బ్యాంకులు రిటైర్డ్ సీనియర్ సిటిజన్ ఉద్యోగులకు 1.50శాతం వరకు అధిక వడ్డీని అందిస్తున్నాయి. యూకో బ్యాంక్, రెగ్యులర్ కస్టమర్లతో పోలిస్తే.. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఒక ఏడాది కన్నా ఎక్కువ కాలపరిమితి ఉన్న FD ఖాతాలపై 0.50 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది.

సాధారణ కస్టమర్లతో పోలిస్తే.. ఏడాది వరకు టెన్యూర్ ఉన్న FD ఖాతాలపై సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం, సిబ్బందికి 1.00 శాతం రిటైర్డ్ సీనియర్ సిటిజన్ సిబ్బందికి 1.25 శాతం ఎక్కువ వడ్డీని ఇస్తోంది.

అంతేకాదు.. ఏడాది కన్నా ఎక్కువ టెన్యూర్ ఉన్న FD ఖాతాలపై సాధారణ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తుంది. అలాగే
రిటైర్డ్ సీనియర్ సిటిజన్ సిబ్బందికి 1.50 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది.

మేలో FD వడ్డీ రేట్లను సవరణ :
యూకో బ్యాంక్ FD పథకం వడ్డీ రేట్లను చివరిసారిగా మే 21న సవరించింది. అప్పటి నుంచి FD ఖాతాలపై యూకో బ్యాంక్ అందించే వడ్డీ రేట్లలో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు.