UIDAI mAadhaar App : యూఐడీఏఐ బిగ్ అలర్ట్.. ‘మైఆధార్’ ఇక పనిచేయదు.. కొత్త ‘Aadhaar’యాప్‌కు ఇలా మారండి..!
UIDAI mAadhaar App : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మైఆధార్ (mAadhaar) పాత యాప్‌ను త్వరలో నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై కొత్త ఆధార్‌ను అందరూ ఉపయోగించాలని సూచించింది.
- Sreehari A
- Published on- May 16, 2026 / 05:24 PM IST
UIDAI mAadhaar App
- పాత మైఆధార్ యాప్ ఇక పనిచేయదు
- యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ ప్రవేశపెట్టింది
- కొత్త ఆధార్ యాప్ 13 భారతీయ భాషలకు సపోర్టు
UIDAI mAadhaar App : ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ప్రస్తుత మైఆధార్ (mAadhaar)యాప్ ఇక పనిచేయదు. అతి త్వరలో ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇదే విషయాన్ని ప్రకటించింది. ఇటీవలే ప్రవేశపెట్టిన కొత్త ఆధార్ యాప్ ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉంది. ఇకపై పాత యాప్ వాడే యూజర్లు కొత్త యాప్ కు స్విచ్ అవ్వాలని వినియోగదారులను కోరింది.
ఐఫోన్ కోసం యాప్ స్టోర్‌లో ఆండ్రాయిడ్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌లు, పౌరులు తమ ఆధార్ సమాచారాన్ని స్టోర్ చేయడం లేదా అప్‌డేట్ చేయడం, ఇతరులతో షేర్ చేసేందుకు
ఈ కొత్త యాప్ క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్, ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ కంట్రోల్ సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
మైఆధార్ (mAadhaar)యాప్ ఇకపై ఉండదు :
ఎక్స్ వేదికగా అధికారిక పోస్ట్‌లో mAadhaar యాప్‌ను త్వరలో నిలిపివేయనున్నట్లు యూఐడీఏఐ ధృవీకరించింది. కొత్త ఆధార్ యాప్ మరింత స్మార్ట్, ఫాస్ట్ అండ్ సేఫ్టీ డిజిటల్ అందించేలా రూపొందించినట్టు సంస్థ పేర్కొంది. ఫాస్ట్ యాక్సస్ కోసం కొత్త ఆధార్ యాప్ 13 భారతీయ భాషలకు సపోర్టు ఇస్తుంది.
యూఐడీఏఐ ప్రకారం.. కొత్త ఆధార్ యాప్‌లో క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్ ఆఫ్‌లైన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫీచర్ ఉంది. “Selective Share” ఫీచర్ వినియోగదారులు తమ ఆధార్ నంబర్‌ను చెప్పకుండానే తమ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవచ్చు. తద్వారా తమ ఫొటో, పేరు, వయస్సు, లింగం, మొబైల్ నంబర్, అడ్రస్ లేదా ఆధార్ స్టేటస్ వంటి పూర్తి డేటాను షేర్ చేయాలో ఎంచుకోవచ్చు.
ఈ యాప్ ఐడెంటిటీ కోసం అధీకృత టెర్మినల్స్ వద్ద స్కాన్ క్యూఆర్ కోడ్‌ను కూడా జనరేట్ చేస్తుంది. తద్వారా వినియోగదారులు తమ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్, అడ్రస్ నేరుగా అప్‌డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ప్రొఫైల్ సెక్షన్‌కు వెళ్లి తమ ఖాతాకు గరిష్టంగా 5గురు కుటుంబ సభ్యులను కూడా యాడ్ చేయొచ్చు.
ఇందులో బయోమెట్రిక్ లాకింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. దుర్వినియోగాన్ని నివారించేందుకు ఫింగర్‌ఫ్రింట్, ఫేస్ అథెంటికేషన్, ఐరీష్ అథెంటికేషన్ డేటాను లాక్ చేసేందుకు వాడొచ్చు. అవసరమైతే ఈ లాక్‌ను యాప్ ద్వారా డిలీట్ చేయొచ్చు. అయితే, లింక్ చేసిన ఫోన్ నంబర్ లేదా స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకుంటే వినియోగదారులు తాత్కాలికంగా ఆధార్ సంబంధిత సేవలను పొందలేకపోవచ్చని యూఐడీఏఐ కూడా పేర్కొంది.
The #mAadhaar App is retiring soon. Now experience a smarter, faster, and more secure digital journey with the new #AadhaarApp. From secure QR-based #Aadhaar sharing to enhanced privacy controls and seamless access to Aadhaar services — the new app is designed to make your… pic.twitter.com/snfeUx4Rgr
— Aadhaar (@UIDAI) May 15, 2026
పాత (mAadhaar) యాప్ నుంచి డేటా కొత్త యాప్‌కు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుందా లేదా అనే విషయాన్ని యూఐడీఏఐ ఇంకా స్పష్టం చేయలేదు. అందుకే ఇప్పటికే ఉన్న యూజర్లు తమ కొత్త యాప్ డౌన్‌లోడ్ చేశాక ప్రొఫైల్స్ మళ్లీ మాన్యువల్‌గా సెటప్ చేయాల్సి ఉంటుంది.
కొత్త ఆధార్ యాప్ డౌన్‌లోడ్, రిజిస్టర్ ఎలా? :
- కొత్త ఆధార్ యాప్ ఆండ్రాయిడ్ iOS కోసం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.
- ఆధార్ యాప్‌ను ఓపెన్ చేసి నచ్చిన లాంగ్వేజీని ఎంచుకోండి.
- మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ద్వారా కొత్త యాప్ రిజిస్టర్ చేసుకోండి.
- ఇతర నంబర్‌లకు అదనపు వెరిఫికేషన్ అవసరం
- మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి OTP ద్వారా SMS వెరిఫికేషన్ పూర్తి చేయండి.
- ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది.
- ఈ సమయంలో బ్యాక్ గ్రౌండ్ బాగా లైటింగ్ ఉండేలా చూసుకోండి.
- ఒకవేళ మీరు కళ్లద్దాలు ధరిస్తే వెంటనే తీసివేయండి.
- ఇప్పుడు, యాప్‌ను యాక్సెస్ కోసం 6 అంకెల పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.
- యాప్ హోమ్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. మీ ఆధార్ కార్డును చూసుకోవచ్చు.
- ఇతరులతో షేర్ చేయొచ్చు. బయోమెట్రిక్ లాక్‌ను సెట్ చేసుకోవచ్చు.
