×
Ad

Union Budget 2026: పన్నుచెల్లింపుదారులకు పండగే.. ITR ఫైలింగ్ గడువు మళ్లీ పొడిగింపు.. కొత్త డేట్ ఇదిగో..!

Union Budget 2026: బడ్జెట్ 2026లో ఐటీఆర్ గడువు పొడిగించారు. పన్ను చెల్లింపుదారులు ITRలో మార్పులకు ఇంకా సమయం ఉంటుంది. ప్రస్తుత గడువు ఏంటి? ఎప్పటివరకూ పొడిగించారో ఇప్పుడు చూద్దాం..

ITR filing deadline ( AI Image Credit to Original Source)

Union Budget 2026 : పన్నుచెల్లింపుదారులకు భారీ ఊరట.. ఇకపై ఐటీఆర్ విషయంలో ఆందోళన అవసరం లేదు. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీ మళ్లి పొడిగించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

9వసారి వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆమె ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం కల్పించారు. ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో ఏదైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరింత సమయం ఉంటుంది.

ప్రస్తుతం డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు ఆర్థిక మంత్రి పొడిగించారు. తద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.

ఆ తర్వాత దాఖలు చేసిన రిటర్న్‌లకు కొత్త వివరాలను కూడా సమర్పించవచ్చు. ఇందుకోసం మరో 3 నెలల సమయం లభిస్తుంది. ఏదైనా పొరపాటు జరిగితే పెనాల్టీ రిస్క్ కూడా తగ్గుతుంది.

Read Also : New Income Tax Act : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. కొత్త పన్ను చట్టంపై కీలక ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి..

ఐటీఆర్ గడువు మార్చి వరకు పొడిగింపు :
ఆలస్యమైన లేదా సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు గడువును పొడిగించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

నామమాత్రపు రుసుము చెల్లించాక ఏదైనా తప్పులను సరిదిద్దడానికి ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం లభిస్తుంది.

పన్ను పోర్టల్ లో ITR-1, ITR-2 దాఖలు చేసే వారికి జూలై 31 గడువు కొనసాగుతుంది. ఆడిట్ కాని వ్యాపార కేసులు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు పొడిగించింది.

విదేశాల్లో ఆస్తులు కలిగిన వారు తమ ఆస్తులను వెల్లడించకపోతే వారికోసం ‘వన్ టైమ్ స్కీమ్’ కూడా ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పెనాల్టీ లేకుండా విదేశీ ఆస్తులను వెల్లడించే అవకాశం ఉంటుంది.