×
Ad

Union Budget 2026 : ఈసారి బడ్జెట్‌లో టాక్స్ పేయర్లకు ఒరిగిందేంటి? నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే?

Union Budget 2026 : బడ్జెట్ టాక్స్ పేయర్లను ఆశలపై నీళ్లు చల్లింది. పన్ను శ్లాబులు తగ్గిస్తుందని ఆశిస్తే ఈసారి బడ్జెట్ లో మొండిచేయి చూపించింది. నిర్మలా సీతారామన్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..

Tax Payers, nirmala sitharaman (Image Credit To Original Source)

  • ఈ బడ్జెట్ సామాన్యులకు తీవ్ర నిరాశ
  • బడ్జెట్ లో ఆశించిన స్థాయిలో ప్రకటనలు లేవు
  • ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

Union Budget 2026 : ఎంతో ఆశగా ఎదురుచూసినా టాక్స్ పేయర్లకు బడ్జెట్ నిరాశే మిగిల్చింది. భారీగా ప్రకటనలు, పన్ను తగ్గింపులు ఉంటాయని భావిస్తే ఎలాంటి ప్రకటనలు లేకుండా తూతూమంత్రంగా బడ్జెట్ ముగించింది ప్రభుత్వం. దీనిపై పన్ను చెల్లింపుదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు.

పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా తగ్గింపులు, రాయితీలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన ప్రకటనలు చేయలేదు. ఇదే పన్ను చెల్లింపుదారులను భారీగా నిరాశపరిచింది. పన్ను స్లాబ్‌లలో కూడా ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. అయితే, కొంతమంది టాక్స్ పేయర్ల కోసం కొన్ని చిన్నమొత్తంలో ప్రకటనలు చేసింది.

ఆగస్టు 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు :

టాక్స్ పేయర్లు తమ రిటర్న్‌లను దాఖలు చేసేందుకు మరోసారి గడువు పొడిగించింది కేంద్రం. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫారమ్‌లతో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రిటర్న్‌ దాఖలు చేసుకోవచ్చు. జూలై 31వ తేదీ గడువు ఉంటుంది. అయితే, ఆడిట్ కాని బిజినెస్ లేదా ట్రస్టులు ఇప్పుడు ఆగస్టు 31 వరకు మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు.

సవరించిన రిటర్నులకు సంబంధించి కూడా ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. సవరించిన రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

Read Also : Union Budget 2026 : ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై నో రిలీఫ్.. అయినా మీ జేబుపై భారం తగ్గుతుంది తెలుసా? ఎలాగంటే?

అయితే, పన్ను చెల్లింపుదారులు దీనికి నామమాత్రపు రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో, డిసెంబర్ 31 లోపు రిటర్నులను దాఖలు చేసేందుకు ఎలాంటి రుసుము ఉండేది కాదు. అయితే, ఈ పొడిగింపుతో పన్ను చెల్లింపుదారులకు అత్యంత ప్రయోజనం కలగనుంది.

త్వరలో కొత్త ఆదాయ పన్ను రూల్స్  అమల్లోకి :

కొత్త ఆదాయపు పన్ను నియమాలు త్వరలో అమల్లోకి వస్తాయి. పన్ను చెల్లింపుదారులకు రిటర్న్ దాఖలుకు రెడీ అయ్యేందుకు తగినంత టైమ్ ఉంటుంది. కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు గతంలో కన్నా సులభంగా ఉంటాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ కొత్త రిటర్న్ ఫారమ్‌లతో పన్ను చెల్లింపుదారులు ఈజీగా రిటర్న్ దాఖలు చేయొచ్చు. దాంతో సాధారణ ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

విదేశీ టూర్ ప్రొగ్రామ్ లపై టీసీఎస్ రేటు తగ్గుతుంది. ఎల్ఆర్ఎస్ పేమెంట్ల కింద విద్య, వైద్య చికిత్స కోసం విదేశాలకు పంపే పేమెంట్లపై టీసీఎస్ కూడా 2శాతానికి తగ్గుతుంది. టీడీఎస్ బెనిఫిట్స్ కోసం కాంట్రాక్టర్ పేమెంట్ల కేటగిరీ కింద సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఎన్ఆర్ఐల కోసం ఒకేసారి విదేశీ ఆస్తులను బహిర్గతం చేసే పథకాన్ని ప్రకటించింది. ‘వన్ టైమ్ స్కీమ్’ కింద ఒక నిర్దిష్ట పరిమితిలోపు తమ విదేశీ ఆస్తులను వెల్లడించని కొంతమంది పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది.