Toll Plaza Travel : బిగ్ రిలీఫ్.. నెలకు జస్ట్ రూ. 340 కడితే చాలు.. టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లు అయినా వెళ్లి రావొచ్చు, ఎవరికి బెనిఫిట్?
Toll Plaza Travel : టోల్ ప్లాజా నుంచి నెల మొత్తం ఫ్రీగా వెళ్లి రావాలంటే ఈ టోల్ ప్లాజా ట్రావెల్ పాస్ తీసుకోవాల్సిందే.. ఈ పాస్ ఎవరు పొందవచ్చు? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే?
Toll Plaza Travel
- టోల్ ప్లాజా ట్రావెల్ నెలవారీ పాస్ ఎలా పొందాలి?
- రూ. 340 చెల్లిస్తే నెల మొత్తం ఎన్నిసార్లు అయినా వెళ్లొచ్చు
- లోకల్ మంత్లీ ట్రావెల్ పాస్ పొందడానికి ఎవరు అర్హులంటే?
- ఏయే వాహనాలకు వర్తిస్తుంది? వేటికి వర్తించదంటే?
- ఎలా అప్లయ్ చేయాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరమంటే?
Toll Plaza Travel : వాహనదారులకు భారీ సర్ప్రైజ్.. మీరు ప్రతిరోజూ టోల్ ప్లాజా దాటుతుంటారా? అయితే, ఇది మీకోసమే. ప్రతిరోజు టోల్ ప్లాజా దాటడం వల్ల ఎక్కువసార్లు టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి సమస్య ఉండదు. భారత జాతీయ రహదారి అథారిటీ వాహనదారుల కోసం అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది.
మీరు నెలంతా ఒకే టోల్ ప్లాజా ద్వారా ఎన్ని సార్లు అయినా వెళ్ళవచ్చు. కేవలం రూ. 340 చెల్లిస్తే సరిపోతుంది. ఈ చిన్న షరతులు పాటిస్తే లోకల్ మంత్లీ పాస్ ఈజీగా పొందవచ్చు. రోజువారీ టోల్ పేమెంట్ల నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఇప్పుడు, ఈ టోల్ ప్లాజా ట్రావెల్ పాస్ ఎవరికి దక్కుతుంది? ఇంతకీ ఈ నెలవారీ పాస్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.
రూ. 340కు అన్లిమిటెడ్ టోల్ పాస్ :
2025-26 ఆర్థిక సంవత్సరానికి లోకల్ నెలవారీ టోల్ ప్లాజా ట్రావెల్ పాస్ ధర కేవలం రూ. 340 మాత్రమే. మీరు ఈ పాస్‌ను ఒకసారి తీసుకుంటే చాలు.. ఆ నెలలో మీరు ఎన్నిసార్లు అయినా టోల్ ప్లాజా ద్వారా ప్రయాణించవచ్చు. ఇందుకోసం ప్రత్యేక టోల్ అవసరం లేదు.
ఒక వ్యక్తి రోజుకు రెండుసార్లు టోల్ దాటితే ఒకసారి టోల్ కోసం రూ. 50 ఖర్చవుతుందని అనుకుందాం. అలాంటప్పుడు, నెలకు దాదాపు రూ. 3వేలు ఖర్చు కావచ్చు. అయితే, ఈ కొత్త ట్రావెల్ పాస్ ద్వారా కేవలం రూ. 340 చెల్లించి నెల మొత్తం ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు.
ఎవరూ అర్హులు?
ఈ నెలవారీ పాస్ బెనిఫిట్స్ పొందాలంటే కొన్ని షరతులను పాటించాలి. అందులో మొదటిది దరఖాస్తుదారుడి నివాసం సంబంధిత టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల లోపల ఉండాలి. రెండోది ప్రైవేట్ వాహనాలు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది.
అంటే, ఆయా వాహనాలకు వైట్ నంబర్ ప్లేట్ ఉండాలి. మూడోది కమర్షియల్ వాహనాలకు ఈ సౌకర్యం లభించదు. పసుపు నంబర్ ప్లేట్ ఉంటే ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. మీరు కారులో ప్రయాణిస్తే మాత్రం యాక్టివ్ ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలి.
ఎలా అప్లయ్ చేయాలి? ఏ డాక్యుమెంట్లు అవసరం? :
ఈ నెలవారీ టోల్ పాస్ కోసం మీరు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ కోసం మీరు ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అధికారిక పోర్టల్ లేదా సంబంధిత ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మంత్లీ పాస్ సెక్షన్ కు వెళ్లండి.
అయితే, ఆఫ్‌లైన్‌లో అప్లయ్ కోసం మీరు నేరుగా టోల్ ప్లాజా పక్కన ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ కౌంటర్‌కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఈ నెలవారీ ట్రావెల్ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు లేదా విద్యుత్ బిల్లు, యాక్టివ్ ఫాస్ట్ ట్యాగ్ ఐడీ ఉండాలి. అయితే, మీ అడ్రస్ ప్రూఫ్‌లో కూడా మీ ఇల్లు టోల్ ప్లాజా నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్నట్టుగా చూపించాలి. అప్పుడే మీరు ఈ ట్రావెల్ పాస్ పొందడానికి అర్హులు. నెలవారీ పాస్ తీసుకుంటే చాలు.. నెలలో ఎన్నిసార్లు అయినా టోల్ ప్లాజా నుంచి ప్రయాణించవచ్చు.
