UPI Charges : UPIలో ఫ్రెండ్‌కు డబ్బులు పంపుతున్నారా? ఇద్దరికీ ఛార్జీలు పడతాయా? అసలు నిజం ఇదే..!

UPI Charges : యూపీఐతో ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు, బంధువులకు ఎవరికైనా పేమెంట్లు చేస్తే ఛార్జీలు వర్తిస్తాయా? పంపినవారికా? లేదా అందుకున్నవారికి కూడా ఛార్జీలు పడతాయా? కోట్లాది యూజర్లలో సందేహానికి సమాధానం ఇదే..

UPI Charges

  • యూపీఐలో డబ్బులు పంపితే అదనపు ఛార్జీలు పడతాయా?
  • స్నేహితులు, కుటుంబ సభ్యులకు చేసే యూపీఐ పేమెంట్లు ఫ్రీ కాదా?
  • కోట్లాది యూపీఐ యూజర్లలో ఇదే ప్రశ్న.. ఇద్దరికీ ఛార్జీలు వర్తిస్తాయా?
  • యూపీఐ ఛార్జీలు ఏయే సందర్భాల్లో వర్తిస్తాయో తెలుసా?

UPI Charges : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈరోజుల్లో ఎక్కువగా అందరూ యూపీఐపైనే ఆధారపడుతున్నారు. ప్రతినిత్యం కిరాణా సరుకుల దగ్గర నుంచి మొబైల్ రీఛార్జ్‌ల వరకు ప్రతిదీ యూపీఐతోనే పేమెంట్ చేస్తున్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది.. యూపీఐతో ఛార్జీలు పడతాయి అని.. చాలామంది యూపీఐ యూజర్లలో ఇదే ప్రశ్న తలెత్తుతోంది..

యూపీఐ ఛార్జీలు అందరికి వర్తిస్తాయా? ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ (UPI) యాప్‌ ద్వారా చేసే పేమెంట్లపై ఛార్జీలు వర్తిస్తాయంటూ పుకార్లు రావడంతో ఇది నిజమేనని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. యూపీఐ యాప్స్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపితే ఛార్జీలు ఇద్దరికి వర్తిస్తాయా? లేదా పంపినవారికే వర్తిస్తాయా? ఇలాంటి సందేహమే అందరిలోనూ వినిపిస్తోంది.

ఉదాహరణకు.. ఫోన్‌పే, గూగుల్ పే, భీమ్, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులకు డబ్బులు పంపితే నిజంగానే ఛార్జీలు పడతాయా? పంపిన వ్యక్తికి ఛార్జీ చెల్లించాలా? లేదా డబ్బులు అందుకున్న వ్యక్తి కూడా ఛార్జీలు చెల్లించాలా? అసలు యూపీఐ రూల్స్ ఏంటి? ఇలా అన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం..

ఫ్రెండ్స్, బంధువులకు యూపీఐ చేసినా ఫీజు పడదు :

ప్రస్తుతం సాధారణ యూపీఐ (UPI) ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపుకోవచ్చు. ఇలా పంపిన వ్యక్తికి ఎలాంటి ఛార్జీలు పడవు. అలాగే డబ్బులు అందుకున్న వ్యక్తికీ కూడా ఎలాంటి యూపీఐ ఫీజు విధించరు. అంటే.. ఫ్రెండ్‌కు రూ. 100 పంపినా రూ.10వేలు పంపినా సాధారణ పీర్-టు-పీర్ (P2P) యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఇద్దరికీ ఎలాంటి ఛార్జీలు ఉండవు.

ప్రస్తుతం యూపీఐ రూల్స్ ప్రకారం.. బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు యూపీఐ ద్వారా చేసే సాధారణ వ్యక్తిగత (Peer to Peer P2P) లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు పడవని గుర్తించుకోవాలి.

Read Also : Amazon Great Freedom Sale : కొత్త ట్యాబ్ కావాలా? అమెజాన్‌లో రూ.30వేల లోపు టాబ్లెట్‌లపై అద్భుతమైన డీల్స్.. మీ ఫేవరెట్ ఇదేనా?

అంటే… మీరు ఫ్రెండ్‌కు రూ. 100 పంపినా, కుటుంబ సభ్యుడికి రూ. 5వేలు పంపినా ఎమర్జెన్సీ కోసం రూ. 25వేలు యూపీఐ చేసినా మీ అకౌంట్ నుంచి పంపిన మొత్తం మాత్రమే డెబిట్ అవుతుంది. అలాగే, డబ్బులు అందుకునే వ్యక్తికి యూపీఐ లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో కూడా అదే మొత్తం పూర్తిగా క్రెడిట్ అవుతుంది. మధ్యలో ఎలాంటి యూపీఐ ఫీజు కట్ కాదు.

ఉదాహరణకు.. ఒక స్నేహితుడు మరో స్నేహితుడికి రూ.2వేలు యూపీఐ ద్వారా పంపాడని అనుకుందాం.. అప్పుడు సదరు వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 2వేలు మాత్రమే డెబిట్ అవుతుంది. స్నేహితుడి అకౌంట్‌లో కూడా రూ. 2వేలు పూర్తిగా క్రెడిట్ అవుతుంది. ఈ యూపీఐ లావాదేవీపై పంపిన వ్యక్తికి గానీ లేదా అందుకున్న వ్యక్తికి ఎలాంటి ఛార్జీ ఉండదు అనమాట.

యూపీఐ ఛార్జీలు ఎప్పుడు పడతాయంటే? :

యూపీఐలో అన్ని లావాదేవీలకూ ఒకే రూల్ వర్తించదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆయా రూల్స్ వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) లేదా వ్యాలెట్ ఆధారంగా జరిగే కొన్ని మెర్చంట్ పేమెంట్లలో మాత్రమే ఇంటర్‌చేంజ్ ఫీజు వర్తించే ఛాన్స్ ఉంటుంది.

అయితే, ఈ ఫీజును సాధారణంగా యూపీఐ యూజర్ల నుంచి నేరుగా ఛార్జ్ చేయరు. పేమెంట్ సిస్టమ్‌లో ఉండే బ్యాంకులు, వ్యాలెట్ సంస్థలు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య సెటిల్ అయ్యే ఛార్జీ మాత్రమే. అందుకే ఫ్రెండ్‌కు లేదా కుటుంబ సభ్యుడికి బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా డబ్బులు పంపే వారికి ఎలాంటి ఛార్జీ పడదు.

మర్చంట్ పేమెంట్ ఏంటి? :
మీరు ఎవరైనా వ్యక్తికి కాకుండా షాపులో QR కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్ చేస్తే.. రెస్టారెంట్ బిల్లు కట్టడం లేదా ఆన్‌లైన్ బిజినెస్ సంస్థకు యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు దాన్ని మెర్చంట్ పేమెంట్‌గా పరిగణిస్తారు. అయితే, ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా రెగ్యులర్ యూపీఐ మర్చంట్ పేమెంట్లు చేస్తే యూజర్లకు ఎక్కువ సందర్భాల్లో ఫ్రీగానే ఉంటాయి. కొన్ని PPI లేదా వ్యాలెట్ ఆధారిత లావాదేవీల్లో మాత్రమే ప్రత్యేక నిబంధనలు వర్తించే ఛాన్స్ ఉంటుంది.

యూపీఐ యూజర్లు తప్పక గుర్తుంచుకోండి :
ప్రస్తుతం బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు జరిగే యూపీఐ ట్రాన్స్‌ఫర్లు పూర్తిగా ఉచితమే.. ఫ్రెండ్స్, బంధువులు, ఫ్యామిలీ మెంబర్లకు డబ్బులు పంపితే ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు పడవు. డబ్బులు అందుకున్న వ్యక్తి ఖాతాలో పంపిన మొత్తం అలానే క్రెడిట్ అవుతుంది. పైసా కూడా కట్ కాదు..

కేవలం కొన్ని PPI లేదా వ్యాలెట్ ఆధారిత మర్చంట్ పేమెంట్లలో మాత్రమే యూపీఐ ఛార్జీలు వర్తిస్తాయి. భవిష్యత్తులో ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ సంస్థలు యూపీఐ లావాదేవీలపై ఏమైనా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తే అప్పుడు మాత్రమే ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది.