×
Ad

Vivo X200 5G Price : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్ భయ్యా.. వివో X200 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Vivo X200 5G Price : వివో X200 5జీ ధర తగ్గింది. వివో ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ విజయ్ సేల్స్‌లో సరసమైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Vivo X200 5G Price

Vivo X200 5G Price : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. అతి తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్ కొనేసుకోవచ్చు. దీపావళి పండగ ముందే వివో X200 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వివో X200 టాప్ వేరియంట్ విజయ్ సేల్స్‌లో తక్కువ ధరకు లభ్యమవుతోంది.

ఈ వివో ఫోన్ జీఈఐఎస్ఎస్-ట్యూన్ కెమెరా సెటప్, డిజైన్‌, ఆకట్టుకునే (Vivo X200 5G Price) పర్ఫార్మెన్స్ కోసం ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ కలిగి ఉంది. రాబోయే పండుగ సీజన్‌లో వివో X200 ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలి? ఇతర ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

వివో X200 ధర తగ్గింపు :
వివో X200 ఫోన్ లాంచ్ ధర కన్నా రూ.4వేలు తక్కువకు కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం రూ.71,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇంకా తగ్గింపు ధరకే పొందాలంటే కస్టమర్‌లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ ద్వారా రూ.5,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తేనే ఈ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : OnePlus 15 Series : కొత్త వన్‌ప్లస్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. ఏకంగా రెండు ఫోన్లు.. కెమెరా ఫీచర్లు హైలెట్ భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

లో-కాస్ట్ ఈఎంఐ నెలకు రూ.3,072 నుంచి పొందవచ్చు. అదే 24 నెలలకు కస్టమర్‌లు 540 పాయింట్లను కూడా పొందవచ్చు. అయితే, నెక్ట్స్ ఆర్డర్‌లో రూ.540కి రీడీమ్ చేసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఇంకా తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, వర్కింగ్ కండిషన్, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

వివో X200 స్పెసిఫికేషన్లు :
వివో X200 అనేది 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కాంపాక్ట్ డివైజ్. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హుడ్ కింద ఈ వివో ఫోన్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ కలిగి ఉంది. 5,800mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది.

డిజైన్ పరంగా, ఈ వివో ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో గ్లాస్ ఫ్రంట్, గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌ను కూడా అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.