Vivo X300 FE : సూపర్ డిస్కౌంట్.. రూ.1.09 లక్షల వివో ఫోన్ జస్ట్ రూ.89,999కే.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తగ్గింపు!
Vivo X300 FE : వివో ఎక్స్300 ఎఫ్ఈపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.89,999కే లభిస్తున్న ఈ ఫోన్‌పై బ్యాంక్ కార్డులతో మరింత తగ్గింపు పొందింది. 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- Sreehari A
- Published on- October 3, 2026 / 03:59 PM IST
Vivo X300 FE
- వివో X300 ఎఫ్ఈ భారీ తగ్గింపుతో అందుబాటులో
- ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం తగ్గింపుతో లభిస్తోంది
- వివో X300 ఎఫ్ఈ 6,500mAh బ్యాటరీతో వస్తుంది
Vivo X300 FE : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో X300 FE ప్రీమియం కెమెరా ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.1,09,999 అసలు ధర ఉండగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.89,999కే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ కార్డు ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. పూర్తి ఆఫర్ల వివరాలివే..
వివో ఎక్స్300 ఎఫ్ఈ తగ్గింపు ధర ఆఫర్ :
వివో X300 ఎఫ్ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.1,09,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం డిస్కౌంట్‌తో రూ.89,999కి లభిస్తోంది. దీంతో కొనుగోలుదారులకు నేరుగా రూ.20వేల వరకు ఆదా అవుతుంది.
Read Also : Electric Two Wheeler Sales : ఎలక్ట్రిక్ స్కూటర్ల దూకుడు.. సెప్టెంబరులో టీవీఎస్‌దే ఆధిపత్యం!
ఇక బ్యాంక్ ఆఫర్లతో మరింత డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.9వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో రూ.13వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. లేటెస్ట్ ఆఫర్లు, అర్హతలేంటో కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకోవడం బెటర్.
వివో X300 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు :
వివో X300 ఎఫ్ఈలో 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్ అందిస్తుంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. 6,500mAh కెపాసిటీతో పాటు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కెమెరా కేటగిరీలో ఎఫ్/1.57 అపర్చర్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. 5G, Wi-Fi, బ్లూటూత్ 6.0, NFC, జీపీఎస్, యూఎస్‌బీ-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
