Vivo Y200e Price : భారత్‌కు వివో Y200e కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!

Vivo Y200e Price : చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి సరికొత్త Y200e ఫోన్ వచ్చేస్తోంది. 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో వై200ఇ మోడల్ లాంచ్ చేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo Y200e Price : భారత్‌కు వివో Y200e కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!

Vivo Y200e Price Range in India Leaked

Vivo Y200e Price : భారత మార్కెట్లో త్వరలో వివో వై200ఇ కొత్త ఫోన్ లాంచ్ కానుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రాబోయే ఈ కొత్త ఫోన్ లాంచ్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ, వివో వై సిరీస్ హ్యాండ్‌సెట్ ముఖ్య ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. వివో వై200ఇ మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Read Also : Apple iPhone 16 Series : కొత్త ఆపిల్ ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. భారీ బ్యాటరీలతో ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 4 మోడల్స్..!

టిప్‌స్టర్ ప్రకారం.. భారత మార్కెట్లో వివో వై200ఇ మోడల్ ధర రూ.20వేల లోపు ఉంటుందని పేర్కొంది. డైమండ్ బ్లాక్, సాఫ్రాన్ డిలైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని చెబుతున్నారు. లీక్ ప్రకారం.. హ్యాండ్‌సెట్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ శాంసంగ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

వివో Y200ఇ ధర, ఫీచర్లు (అంచనా) :
6జీబీ + 8జీబీ ర్యామ్ ఆప్షన్లు, 128జీబీ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్ఓసీపై రన్ అవుతుంది. ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు పెంచుకోవచ్చు. వివో వై200ఇ ఆండ్రాయిడ్ 13 లేదా ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందిస్తోంది. వివో వై200ఇ మోడల్ సుమారు 7.79ఎమ్ఎమ్ మందం, 185.5 గ్రాముల బరువు ఉంటుంది.

గత ఏడాది అక్టోబర్‌లో వివో వై200 మోడల్ బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 21,999కు లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ, 64ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also :  Apple iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!