Apple iPhone 16 Series : కొత్త ఆపిల్ ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. భారీ బ్యాటరీలతో ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 4 మోడల్స్..!
Apple iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. గత ఐఫోన్ల వెర్షన్ల కన్నా భిన్నంగా భారీ బ్యాటరీలతో రానున్నాయి. మొత్తం 4 మోడళ్లు రానున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Apple iPhone 16 And 16 Pro Max Tipped to Pack Bigger Batteries
Apple iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్లు అంటే.. ఆ మాత్రం హైప్ ఉంటుంది మరి.. ఏ ఫోన్లకు లేని క్రేజ్ ఈ బ్రాండ్‌కే సొంతం. ప్రపంచ మార్కెట్లో కొత్త ఐఫోన్ వస్తుందంటే.. ఆపిల్ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి మరో కొత్త ఐఫోన్ సిరీస్ రాబోతోంది.
అదే.. ఐఫోన్ 16 సిరీస్ మోడల్.. ఈసారి రాబోయే ఈ ఐఫోన్ సిరీస్ మోడల్స్‌లో బ్యాటరీ ప్యాక్ గురించి ప్రత్యేకంగా వినిపిస్తోంది. అందులో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే మొత్తం 4 మోడళ్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే? :
ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఎప్పుడైనా కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి లీక్‌లు, పుకార్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ సామర్థ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌తో పోలిస్తే.. ఐఫోన్ 16 ప్రో సిరీస్ బ్యాటరీలు చాలా పెద్దవిగా ఉండవచ్చు. వనిల్లా ఐఫోన్ 16 మోడల్ 3,561ఎంఎహెచ్ సెల్‌ను కలిగి ఉండవచ్చు. అయితే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ 4,676ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది.
గత వెర్షన్ల కన్నా పెద్ద బ్యాటరీలతో :
టిప్‌స్టర్ ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు గత వెర్షన్ల కన్నా పెద్ద బ్యాటరీలతో రానున్నాయ. ఆన్‌లైన్‌లో లీక్ డేటా ప్రకారం.. ఐఫోన్ 16 ప్లస్ మోడల్ గత ఏడాది మోడల్‌తో పోలిస్తే.. బ్యాటరీ సామర్థ్యంలో కొంచెం తగ్గుదలని చూడవచ్చు. లీక్ డేటాను పరిశీలిస్తే.. ఐఫోన్ 16 మోడల్ 3,561ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 ప్లస్, 4,006ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ 4,676ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

Apple iPhone 16 Bigger Batteries
బ్యాటరీ సెటప్‌లో రీడిజైన్ :
టాప్-ఎండ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బ్యాటరీ సెటప్‌లో ఇంటర్నల్ రీడిజైన్ ఉండనుందని సమాచారం. రాబోయే బ్యాటరీ సెటప్ ఎల్- ఆకారానికి బదులుగా దీర్ఘచతురస్రాకార ఆకారాన్ని కలిగి ఉండనుంది. ఆపిల్ సాధారణంగా ఐఫోన్ బ్యాటరీ సామర్థ్యాలను బయటకు రివీల్ చేయదు. అయితే, ఐఫోన్ 15 మోడల్ 3,349ఎంఎహెచ్ బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉందని, ఐఫోన్ 15 ప్లస్ 4,383ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉందని టిప్‌స్టర్ పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ 4,422ఎంఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ అందిస్తుంది. చాలావరకు ఐఫోన్లలో మునుపటి టియర్‌డౌన్ వీడియోల్లో వెల్లడైన బ్యాటరీ సామర్థ్యాలకు అనుగుణంగా ఉంటాయి.
Based on the information I managed to obtain, the new iPhone 16 will have a 3561 mAh battery, while the 16 plus should have a 4006 mAh battery and the 16 Pro Max, should be equipped with a 4676 mAh battery that is no longer L-shaped due to the redesign of the internal structure… pic.twitter.com/T7VuhQ6Brs
— Majin Bu (@MajinBuOfficial) February 7, 2024
ఐఫోన్ 15 బ్యాటరీ సామర్థ్యం :
ఆపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్ లిథియం-అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ యూనిట్లతో వచ్చింది. నాన్-ప్రో మోడల్‌ల బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 26 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ ఆఫర్ చేస్తుందని చెబుతోంది. ఐఫోన్ ప్రో మోడల్‌ల బ్యాటరీ యూనిట్ సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 29 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. సాధారణ ఐఫోన్ 15 మోడల్‌లు 2022లో ఆవిష్కరించిన ఎ16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ అందిస్తుంది.
ఐఫోన్ 15 మోడల్ బట్టి ధరలివే :
అదే సమయంలో, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఎ17 ప్రో చిప్‌తో పనిచేస్తాయి. భారత మార్కెట్లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ 15 ప్రో బేస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,39,900, అయితే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,59,900కు అందుబాటులో ఉంది.
Read Also : Asus Chromebook CM14 : అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 కొత్త ల్యాప్‌టాప్ ఇదిగో.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?