Asus Chromebook CM14 : అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 కొత్త ల్యాప్‌టాప్ ఇదిగో.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?
Asus Chromebook CM14 : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో అసూస్ క్రోమ్‌బుక్ CM14 ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. భారత మార్కెట్లో ధర ఎంతంటే?

Asus Chromebook CM14 With MediaTek Kompanio 520 CPU Launched
Asus Chromebook CM14 : భారత మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అసూస్ నుంచి క్రోమ్‌బుక్ సీఎమ్14 కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లో మీడియాటెక్ (Kompanio) ప్రాసెసర్‌ని అమర్చారు. మిలిటరీ-గ్రేడ్ ప్రొటెక్షన్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది.
అసూస్ ల్యాప్‌టాప్ అద్భుతమైన డిజైన్, మెటాలిక్ ఫ్రేమ్ 180-డిగ్రీల ‘లే-ఫ్లాట్’ హింగ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. వినియోగదారులు తమ స్నేహితులు, తోటివారితో కంటెంట్ షేరింగ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ సింగిల్ ఛార్జింగ్‌పై 15 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ కొత్త మోడల్ సింగిల్ మెమరీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
భారత్‌లో అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 ధర, లభ్యత :
భారత మార్కెట్లో అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 మోడల్ గ్రావిటీ గ్రే కలర్ ఆప్షన్లో రూ. 26,990 ధరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 ఫీచర్లు :
కొత్తగా లాంచ్ అయిన క్రోమ్‌బుక్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 220నిట్స్, 16:9 అస్పెక్ట్ రేషియోతో 14-అంగుళాల ఫుల్-హెచ్డీ (1,920 x 1,080 పిక్సెల్‌లు) యాంటీ-గ్లేర్ నాన్-టచ్ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ (Kompanio) 520 సీపీయూ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. ఏఆర్ఎమ్ మాలి జీ52 ఎంపీ2 జీపీయూ, 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది.
గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రీ-ఇన్స్టాల్ అయి ఉంటుంది. 128జీబీ ఇఎమ్ఎమ్సీ ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 ప్రైవసీ షట్టర్, ఇంటర్నల్ ఫేస్ ఏఈ ఫీచర్‌తో 720పీ వెబ్‌క్యామ్ కెమెరాను కలిగి ఉంది. టచ్‌ప్యాడ్ సపోర్టుతో గెచర్ ఇన్‌పుట్‌తో 405సీసీ, ఎర్గోనామిక్ స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్‌తో కూడా వస్తుంది.

Asus Chromebook CM14 Launched
సెక్యూరిటీ విషయానికి వస్తే.. :
ల్యాప్‌టాప్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్, కెన్సింగ్టన్ నానో సెక్యూరిటీ స్లాట్, టైటాన్- సీ సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. 42డబ్ల్యూహెచ్ 2-సెల్ బ్యాటరీ సపోర్టు, అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వై-ఫై 6, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది.
అసూస్ ల్యాప్‌టాప్‌లో రెండు యూఎస్బీ 3.2 జనరేషన్ 1 టైప్-సి పోర్ట్‌లు, యూఎస్బీ 3.2 జనరేషన్ 1 టైప్-ఎ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ 2-ఇన్-1 మైక్రోఫోన్/హెడ్‌ఫోన్ జాక్, మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్ ఉన్నాయి. ఈ డివైజ్ 324.6ఎమ్ఎమ్ x 226.7ఎమ్ఎమ్ x 18.3ఎమ్ఎమ్, 1.45కిలోల బరువు ఉంటుంది.