Home Loan EMI : మీ హోం లోన్‌ ఒక నెల EMI కట్టలేదా..? వెంటనే ఇలా చేయండి.. ఈ రూల్స్ తెలియకపోతే భారీగా నష్టపోతారు!

Home Loan EMI : మీ హోం లోన్ ఈఎంఐ ఒక నెల EMI కట్టడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? బ్యాంకు మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటుందా? రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు వచ్చి వసూలు చేస్తారా? అసలు మీరేం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Home Loan EMI

  • మీకు హోం లోన్ ఉందా? ఒక నెల ఈఎంఐ కట్టలేదా?
  • హోం లోన్ తీసుకున్నా ఈఎంఐ కట్టడం మానేస్తే ఏమౌతుంది?
  • సిబిల్ స్కోరు పడిపోతుందా? బ్యాంకులు ఇంటిని స్వాధీనం చేసుకుంటాయా?

Home Loan EMI : మీకు హోం లోన్ ఉందా? ప్రతినెలా తప్పకుండా ఈఎంఐ కడుతున్నారా? ఏదో ఒక నెల ఈఎంఐ కట్టడం మర్చిపోతే ఏమౌతుందో తెలుసా? చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది. హోం లోన్ ఈఎంఐ ఒక నెలా మిస్ అయినా ఎలాంటి ప్రభావం ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు. కొన్నిసార్లు నిర్లక్ష్యం వల్ల కాకుండా జీతం ఆలస్యం కావడం లేదా మెడికల్ ఎమర్జెన్సీ వంటి ఆకస్మిక ఖర్చుల కారణంగా ఇలా జరుగుతుంది.

ఇలాంటి పరిస్థితులలో బ్యాంకు మిమ్మల్ని డిఫాల్టర్‌గా ప్రకటిస్తుందేమో లేదా మీ క్రెడిట్ స్కోర్ (CIBIL) భారీగా దెబ్బుతింటుందని భయంగా అనిపిస్తుంటుంది. అయితే, అసలు వాస్తవం ఏమిటంటే.. ఈఎంఐ చెల్లించడం మర్చిపోవడం పెద్ద సంక్షోభం కాదు.. కానీ మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.

ఈఎంఐ మిస్ అయితే ఫస్ట్ జరిగేది ఇదే :
ఈఎంఐ గడువు తేదీ దగ్గరపడగానే.. బ్యాంకు సిస్టమ్‌లో మీ లోన్ అకౌంట్ పెండింగ్ ఉందని అలర్ట్ చేస్తుంది. మొదట్లో, మీకు ఆటోమేటెడ్ మెసేజ్, ఇమెయిల్‌లు వస్తాయి. కొన్ని రోజుల తర్వాత బ్యాంకు రికవరీ టీమ్ నుంచి మీకు కాల్ రావచ్చు. దీనికి బ్యాంకు ఆలస్య రుసుము లేదా జరిమానా వడ్డీని వసూలు చేస్తుంది.

ఈ మొత్తం పెద్దగా ఉండదు. కానీ, ఆలస్యం కొనసాగిన కొద్దీ ఇది పెరుగుతుంది. ఈ సమయంలో బ్యాంకు ఫోన్ కాల్స్‌ను నిర్లక్ష్యం చేయవద్దు. ఆలస్యం ఎందుకు జరిగింది? మీరు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టంగా వివరించండి. ఇది పొరపాటా లేక మీ వద్ద నిజంగా డబ్బులు లేవా? అని బ్యాంకు తెలుసుకుంటుంది.

Read Also : PAN Card Rules : మీ పాన్ కార్డు పోయిందా? మార్పులు చేయాలా? కొత్త CBDT రూల్స్ షాక్… చిన్న మిస్టేక్ చేసినా భారీ ఫైన్!

క్రెడిట్ స్కోర్‌పై ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుంది? :
ఒక్క రోజు ఆలస్యం కూడా మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుందని భావిస్తుంటారు. అందులో నిజం లేదు. ఆలస్యం 30 రోజులు (నెల) దాటితే తప్ప బ్యాంకులు సాధారణంగా క్రెడిట్ బ్యూరోలకు ఆలస్యాల గురించి రిపోర్టు చేయవు.

మీరు నెలాఖరులోపు మీ చెల్లింపు చేస్తే.. మీ క్రెడిట్ స్కోర్‌పై తరచుగా ఎలాంటి ప్రభావం ఉండదు. బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు ఒకసారి జరిగిన పొరపాటును పెద్దగా పట్టించుకోవు. కానీ అది పదేపదే జరిగితే మీ క్రెడిట్ స్కోర్ వేగంగా పడిపోవచ్చు.

బ్యాంకు ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందా? :
ఒక్క ఈఎంఐ చెల్లించనంత మాత్రాన రికవరీ ఏజెంట్ గానీ, లీగల్ నోటీసు గానీ రావు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. వరుసగా 90 రోజుల పాటు చెల్లింపులు జరగనంత వరకు గృహ రుణాన్ని NPAగా ప్రకటించరు.

చాలా నెలల పాటు పేమెంట్లు కొనసాగిన తర్వాత పలు అధికారిక నోటీసులు అందిన తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యలు లేదంటే ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఉంటుంది. ఒక ఈఎంఐ కట్టనంత మాత్రాన మీ లోన్ రూల్స్ లేదా వడ్డీ రేటు మారవు.

ఈఎంఐ కట్టడం మర్చిపోతే ఏం చేయాలి? :
మీరు ఈఎంఐ కట్టడం మర్చిపోతే మీ బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పండి. మీ నిజాయితీ బ్యాంకుతో రిలేషన్ పెంచుతుంది. ఆ పొరపాటు ఆటో-డెబిట్ ఫెయిల్ వంటి టెక్నికల్ లేదా నిజంగానే కట్టలేదా అని నిర్ధారించుకోండి. వెంటనే ఈఎంఐ పెనాల్టీతో సహా వీలైనంత త్వరగా లోన్ చెల్లించండి.

హోం లోన్ ఈఎంఐ చెల్లించడం మర్చిపోవడం పెద్ద విషయం కాదు. అది ఒక హెచ్చరిక మాత్రమే. మీరు వెంటనే పరిష్కరించుకుంటే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. బ్యాంకులు మీ ఇబ్బందులను అర్థం చేసుకుంటాయి. వారితో సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండండి చాలు..