Electric Car Insurance : కొత్త EV కారు కొంటే లక్షల్లో సేవ్ చేయొచ్చు.. కానీ, ఇన్సూరెన్స్‌లో ఈ పొరపాట్లు చేస్తే భారీ నష్టమే!
Electric Car Insurance : సాధారణ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లకు ఇన్సూరెన్స్ ఖరీదైనదే. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, రిపేరింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
Electric Car Insurance
- కొత్త EV కొనేముందు తప్పక చూడండి! ఇన్సూరెన్స్‌పై పూర్తి గైడ్
- ఇన్సూరెన్స్ విషయంలో ఈ విషయాలు చాలా ముఖ్యం
- ఎలక్ట్రిక్ కారు ఇన్సూరెన్స్ ఖర్చు తగ్గాలంటే ఇలా చేయండి
Electric Car Insurance : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల ఇన్సూరెన్స్ ఎందుకు ఖరీదైనదిగా మారిందో తెలుసా? వాస్తవానికి, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఒక కారణమైతే.. పొలుష్యన్ వంటి కారణాలు, తక్కువ మెయింట్ నెన్స్ ఖర్చుల కోసం కూడా ఈవీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే, ఎలక్ట్రిక్ కార్ల బీమా విషయానికి వస్తే.. సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్లతో పోలిస్తే ప్రీమియం కొద్దిగా ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈవీ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంత ఖరీదైనది? కొత్త ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఈవీ ఇన్సూరెన్స్ ఎందుకు ఖరీదైనది? :
ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. చాలా సందర్భాల్లో కారు మొత్తం ధరలో 30 శాతం నుంచి 50 శాతం వరకు బ్యాటరీ ఖరీదు ఉంటుంది. ప్రమాదం, వరద, అగ్నిప్రమాదం లేదా ఇతర టెక్నికల్ గ్లిచ్ కారణంగా బ్యాటరీ దెబ్బతింటే అది రిప్లేస్ లేదా రిపేరింగ్ కోసం లక్షల్లో ఖర్చవుతుంది. అందుకే బీమా సంస్థలు ఈవీ ప్రీమియంలపై బ్యాటరీ ఖర్చును కూడా లెక్కలోకి తీసుకుంటున్నాయి.
రిపేర్లకు ఎక్కువ ఖర్చు :
ఎలక్ట్రిక్ కార్లలో అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, సెన్సార్లు, కంట్రోలింగ్ యూనిట్లు సాఫ్ట్వేర్లతో వస్తాయి. రిపేర్లకు ప్రత్యేక టెక్ ఇంజనీర్లు అవసరం. ప్రస్తుతం, దేశంలోని ప్రతి నగరంలో ఈవీ రిపేరింగ్ సెంటర్లు అందుబాటులో లేవు. తద్వారా రిపేరింగ్ మరింత కాస్టలీగా మారుతోంది. ఈ కారణంగానే ఈవీ బీమా ప్రీమియంలు పెరిగిపోతున్నాయి.
బ్యాటరీ కవర్ తప్పనిసరి :
మీరు ఎలక్ట్రిక్ కారు కొనేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా.. అలాగే బ్యాటరీ ప్రొటెక్షన్ కవర్ కూడా తీసుకోండి. ఏదైనా ప్రమాదం, వరదలు, అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర విద్యుత్ సమస్యల కారణంగా బ్యాటరీ దెబ్బతిన్నప్పుడు కవర్ అవుతుంది. ఈవీ బ్యాటరీలు అత్యంత ఖరీదైనవి. ఈ కవర్ భవిష్యత్తులో తలెత్తే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీకు లక్షల్లో ఆదా అవుతుంది.
రోడ్డు సైడ్ అసిస్టెన్స్ ముఖ్యమే :
ఎలక్ట్రిక్ కార్లు రన్నింగ్ టైంలో కొన్నిసార్లు ఒక్కసారిగా ఆగిపోవచ్చు. లేదంటే బ్యాటరీ ఛార్జ్ దిగిపోవడం లేదా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో లేకపోవడం వంటి జరుగుతాయి. ముఖ్యంగా లాంగ్ టూర్ ప్రయాణాల్లో చాలా సమస్యగా మారవచ్చు.
ఇలాంటి పరిస్థితులలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సర్వీసు టోయింగ్, ఆన్-రోడ్ అసిస్టెన్స్ చాలా సందర్భాలలో సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ లేదా సర్వీస్ సెంటర్‌కు రవాణా వంటి సేవలను అందిస్తుంది.
తక్కువ ప్రీమియంతో తీసుకోవద్దు :
చాలా మంది తక్కువ ప్రీమియం ఉన్న పాలసీనే ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ, ఆ తర్వాత అందులో అవసరమైన ఫీచర్లు లేవని వర్రీ అవుతుంటారు. అందుకే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ధరనే కాకుండా అందులోని కవరేజీలను కూడా చెక్ చేయడం బెటర్.
మీరు తీసుకునే ఈవీ ఇన్సూరెన్స్ పాలసీలో బ్యాటరీ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కవరేజ్, ఇంకా ప్రకృతి వైపరీత్యాలు వరదల నుంచి ప్రొటెక్షన్ వంటివి ఉండాలి. సరైన పాలసీని ఎంచుకునే ముందు ఈ ఫీచర్లన్నింటినీ చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది.
