E20 Petrol Price : E20 పెట్రోల్‌పై కేంద్రం షాకింగ్ క్లారిటీ.. 5శాతం మైలేజీ తగ్గినా ధర ఎందుకు తగ్గదంటే? అసలు రీజన్ ఇదే!
E20 Petrol Price : ఈ-20 పెట్రోల్ వినియోగంపై కేంద్రం వాహనదారులకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. 5 శాతం మైలేజీ తగ్గే అవకాశం ఉందని, ధర మాత్రం పెట్రోల్ కన్నా తక్కువకు రాదని తెలిపింది.. అసలు రీజన్ ఏంటో కూడా వెల్లడించింది.
- Sreehari A
- Published on- July 11, 2026 / 03:40 PM IST
E20 Petrol Price
- ఈ20 క్లీన్ ఇంధనం.. ఇంజిన్ పనితీరుపై నో ఎఫెక్ట్
- ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించేందుకు కాదన్న కేంద్రం
- ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడమే లక్ష్యం
- విమర్శలు, ఆందోళనలకు వివరణ ఇచ్చిన మంత్రిత్వశాఖ
E20 Petrol Price : మీ కారు లేదా బైకు ఉందా? ఈ-20 ఇంధన వినియోగంతో ఇంజిన్ దెబ్బతింటుందా? మైలేజీ తగ్గుతుందా? చాలామంది వాహనదారుల్లో ఇదే ఆందోళన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ-20 పెట్రోల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ e-20 వినియోగంపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పూర్తి క్లారిటీ ఇచ్చింది.
మైలేజీ తగ్గినా ప్రయోజనాలే ఎక్కువ.. :
ఈ-20 ఇంధనం వాడితే వాహనాల మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే, హై ఆక్టేన్ రేటింగ్, మెరుగైన ఇంజిన్ పర్ఫార్మెన్స్, స్మూత్ యాక్సిలరేషన్, తక్కువ కార్బన్ ఉద్గారాలు వంటి బెనిఫిట్స్‌తో పోలిస్తే ఈ ప్రభావం చాలా తక్కువని కేంద్రం పేర్కొంది.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై విమర్శలకు సమాధానంగా కేంద్రం ప్రభుత్వం ప్రశ్నోత్తరాల పత్రాన్ని విడుదల చేసింది. ఈ-20 ఇంధనాన్ని ఏళ్ల పాటు శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో సంప్రదింపులు, దేశీయ ఇథనాల్ ఉత్పత్తి విస్తరణ తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది.
Read Also : TRAI Spam Calls : 1600, 140 నంబర్లతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఇక మోసపోవద్దు.. ట్రాయ్ క్లారిటీ ఇదే!
అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్నాం :
2001లో పైలట్ ప్రాజెక్టుగా ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ప్రారంభమైందని, అప్పటినుంచి దశలవారీగా విస్తరిస్తూ వస్తున్నట్టు పేర్కొంది. 2022లో 10 శాతం మిశ్రమ లక్ష్యాన్ని ముందుగానే చేరుకోగా 2025-26లో 20 శాతం మిశ్రమానికి చేరుకున్నట్లు వెల్లడించింది.
హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు ఈ-20 ఇంధనం కారణంగా ఇంజిన్ తుప్పు, అరుగుదల లేదా స్పేర్ పార్టుల లైఫ్ టైమ్‌పై ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్ పడలేదని పేర్కొంది. పెట్రోల్ బంకుల్లో ఈ-10, ఈ-20తో పాటు స్వచ్ఛమైన పెట్రోల్ అందించాలనే డిమాండ్‌ను లాజిస్టిక్ సమస్యల కారణంగా తిరస్కరించింది.
ఈ-20 కార్యక్రమం లక్ష్యం కేవలం పెట్రోల్ ధరలు తగ్గించడం కాదని, ముడి చమురు దిగుమతులను తగ్గించి ఇంధన భద్రతను బలోపేతం చేయడమేనని కేంద్రం వివరణ ఇచ్చింది. 2014-15 నుంచి ఇథనాల్ మిశ్రమ కార్యక్రమంతో రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని తెలిపింది.
అంతేకాదు.. 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులు, 952 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని తెలిపింది. ఈ-20పై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.
